గోళ్లు( Nail )చాలా మంది వీటిని అందానికి చిహ్నంగా భావిస్తుంటారు.గోళ్లను పొడుగ్గా పెంచుకోవాలని మగువలు తెగ ఆరాటపడుతూ ఉంటారు.
కానీ సరైన పోషణ లేకపోవడం, కేర్ తీసుకోకపోవడం వల్ల గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఈ క్రమంలోనే కొందరు ఆర్టిఫీషియల్ నెయిల్స్ ను అమర్చుకుంటూ ఉంటారు.
వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను కనుక పాటిస్తే సహజంగానే పొడవాటి బలమైన గోళ్లను మీ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గోళ్లకు అప్లై చేసుకోవాలి.రోజు నైట్ ఈ విధంగా చేయాలి.
బలమైన మరియు పొడవాటి గోళ్లకు నిమ్మరసం చాలా సహాయకారిగా ఉంటుంది.మరియు తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
ఇవి మీ గోర్లు మరియు క్యూటికల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకోవాలి.అలాగే రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి హీట్ చేయాలి.దీంతో వెల్లుల్లి మరియు అల్లం సారం ఆలివ్ ఆయిల్ లోకి దిగుతుంది.ఇప్పుడు ఆ ఆయిల్ ను గోళ్లకు అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ ఆయిల్ ను వాడితే పొడవాటి బలమైన గోర్లు మీ సొంతం అవుతాయి.చీటికిమాటికి గోర్లు విరగకుండా ఉంటాయి.

ఇక పొడవాటి మరియు బలమైన గోర్లు కోసం మరొక ప్రభావవంతమైన హోం రెమెడీ ఉంది.దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని గోళ్లకు అప్లై చేసుకుని గంట తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.టమాటోలో బయోటిన్ ఉంటుంది.ఇది గోర్లు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.వేగవంతమైన మరియు బలమైన గోర్లు పెరుగుదలకు ఉపయోగకరంగా ఉంటుంది.
విటమిన్ ఈ ఆయిల్ కూడా గోర్లను బలంగా పొడుగ్గా పెంచడానికి సహాయపడుతుంది.