పెసలు.( Moong Dal ) ఇంగ్లీష్ లో వీటిని గ్రీన్ మూంగ్ దాల్ అని పిలుస్తారు.
పెసలతో దోశ, పునుగులు ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు.కొందరైతే పెసలను పెద్దగా పట్టించుకోరు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చాలా ప్రయోజనాలను మీరు నష్టపోతున్నారు.పెసలేగా అని తీసిపారేయొద్దు.పెసల్లో మన ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా ఉడికించిన పెసలను తినడం వల్ల మీరు ఊహించని హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
మధుమేహంతో( Diabetes ) బాధపడుతున్న వారికి బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించి పెసలు ఉత్తమ ఎంపిక అవుతుంది.పెసలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.అందువల్ల పెసలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి.
పెసల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.ఉడికించిన పెసలు తింటే శరీరానికి బోలెడంత ఎనర్జీ లభిస్తుంది.
నీరసం( Fatigue ) పరార్ అవుతుంది.కండరాలను నిర్మాణానికి కూడా పెసలు గ్రేట్ గా తోడ్పడతాయి.
రక్తహీనత బారినపడ్డవారు వారినికి కనీసం రెండు సార్లు అయినా ఉడికించిన పెసలను తినాలి.ఎందుంటే, పెసల్లో ఐరన్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది.ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.జీర్ణక్రియ మరియు ప్రేగు పనితీరును పెంచే సామర్థ్యం పెసలకు ఉంది.మలబ్ధకంతో( Constipation ) సతమతం అవుతున్నవారు ఉడికించిన పెసలు డైట్ లో చేర్చుకుంటే సులభంగా ఆ సమస్యను బయటపెడతారు.
పెసల్లో ఫినోలిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, సిన్నమిక్ యాసిడ్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా నిరోధించడంలో తోడ్పడతాయి.అంతేకాదు ఉడికించిన పెసలను( Boiled Moong Dal ) డైట్ లో చేర్చుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యంగా మారుతుంది.బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేస్తుంది.
ఒంట్లో అధిక వేడి సైతం తొలగిపోతుంది.