ఇటీవల రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా బయట ఆహారాలకు అలవాటు పడుతున్నారు.చిరుతిళ్ళు అనగానే బజ్జీలు, పకోడీలు, సమోసా, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవే వారికి గుర్తుకు వస్తున్నాయి.
కానీ ఇటువంటి ఆహారాలు పిల్లల ఆరోగ్యాన్నే కాదు ఎదుగుదలను కూడా దెబ్బతీస్తాయి.కాబట్టి పిల్లలు తినే ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా తగిన శ్రద్ధ పెట్టాలి.
వారి డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.ఇకపోతే ఎదిగే పిల్లలకు ఇప్పుడు చెప్పబోయే లడ్డూ( Laddu ) మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.
రోజుకొకటి ఈ లడ్డూను వారి చేత తినిపిస్తే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.మరి ఇంతకీ ఆ ఎనర్జీ బూస్టర్ లడ్డూను( Energy Booster Laddu ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? అది అందించే ప్రయోజనాలు ఏంటో.? తెలుసుకుందాం పదండి.
![Telugu Anjeer, Badam, Cashew, Energybooster, Tips, Healthy Laddu, Latest, Nutsdr Telugu Anjeer, Badam, Cashew, Energybooster, Tips, Healthy Laddu, Latest, Nutsdr](https://telugustop.com/wp-content/uploads/2024/10/This-is-an-energy-booster-laddu-for-growing-children-detailsd.jpg)
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా( Phool Makhana ) వేసి వేయించుకోవాలి.అదే పాన్ లో ఒక కప్పు బాదం పప్పు, అర కప్పు జీడిపప్పు, అర కప్పు వాల్ నట్స్ ను కూడా వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.అనంతరం అదే మిక్సీ జార్ లో ఐదు నుంచి ఆరు అంజీర్, పది నుంచి పన్నెండు గింజ తొలగించిన సాఫ్ట్ ఖర్జూరాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
![Telugu Anjeer, Badam, Cashew, Energybooster, Tips, Healthy Laddu, Latest, Nutsdr Telugu Anjeer, Badam, Cashew, Energybooster, Tips, Healthy Laddu, Latest, Nutsdr](https://telugustop.com/wp-content/uploads/2024/10/This-is-an-energy-booster-laddu-for-growing-children-detailsa.jpg)
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుకా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసి బాగా మిక్స్ చేసి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.ఈ లడ్డూలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని పిల్లల చేత రోజుకొకటి చొప్పున తినిపించాలి.ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూలో పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ( Nuts And Dry Fruits Laddu ) పిల్లలకు బోలెడంత శక్తిని చేకూరుస్తుంది.
వారిని ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుతుంది.పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది.
అలాగే ఈ లడ్డూలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.పొటాషియం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
మెగ్నీషియం కండరాల పనితీరుకు సహాయపడుతుంది.ఇనుము రక్తహీనతను నివారిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టంతో పోరాడటానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.అంతేకాకుండా ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు మరియు ఆరోగ్యకరమైన ప్రేగులను నిర్వహించడానికి తోడ్పడతాయి.