1.సీఎం కేసీఆర్ కు అస్వస్థత
తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు.శుక్రవారం ఉదయం కెసిఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు.ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
2.రాజాసింగ్ పై కేసు కొట్టివేత
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేసిన కేసు ను హైకోర్టు కొట్టివేసింది.2018 ఎన్నికల అఫిడవిట్ పైన ఉన్న కేసులను దాచిపెట్టారని అప్పట్లో టిఆర్ఎస్ తరఫున గోషామహల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు.
3.జగన్ కీలక వ్యాఖ్యలు
త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులతో సీఎం జగన్ తెలిపారు.
4.నన్ను కాంట్రాక్టర్ అనడం బాధాకరం : కోమటిరెడ్డి
మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనను కాంట్రాక్టర్ అనడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మంత్రి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
5.కెసిఆర్ త్వరగా కోలుకోవాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు.
6.1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే
తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నవంబర్లోపలే నియామక పత్రాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
7.ప్రవేశ పరీక్షలకు పాత ఫీజు లే
తెలంగాణలో ఏడాది నిర్వహించే వివిధ పరీక్షలకు గతంలో నిర్ణయించిన ఫీజులను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
8.బడ్జెట్ పై వీర్రాజు కామెంట్స్
ఏపీ బడ్జెట్ పొంతన లేదని ,హాస్యాస్పదంగా ఉందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్ చేశారు.
9.టీటీడీ బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై హైకోర్టులో విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రత్యేక ఆహ్వానితులు నియామకం పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై గతంలో ఇచ్చిన స్టే ని కొనసాగించారు.
10.ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ వద్దు
ఇంటర్ విద్యార్థులకు వారి చదువుతున్న కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
11.ఏపీ వార్షిక బడ్జెట్
2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.
12.ఏపీ అసెంబ్లీకి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీ అసెంబ్లీకి నిరసన ర్యాలీ గా బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది అంటూ లోకేష్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.
13.కేజ్రీవాల్ తో నటుడు కమల్ హాసన్
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సినీ నటుడు కమల్ హాసన్ కూడా కేజ్రీవాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
14.రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఆత్మీయ కరచాలనం
తెలంగాణ కాంగ్రెస్ లో సఖ్యత లేనట్టు గా రాహుల్న ఇస్తున్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా కరచాలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు.
15.వీహెచ్ సంచలన కామెంట్స్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అత్యవసరంగా ప్రక్షాళన చేయకపోతే కష్టమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు.
16.టెట్ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు
ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో టెట్ నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
17.కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలి : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది.అమ్మవారి కృపతో కెసిఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు .
18. నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించడంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ మేరకు ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవనున్నారు.
19.ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,580
.