భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర దేశాలు ఇప్పటికే భారతీయులతో కిక్కిరిసిపోతున్నాయి.

 Israel Govt Launches E-visa System For Indian Travelers Details, Israel Govt ,is-TeluguStop.com

ఈ నేపథ్యంలో కొత్తగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలను అన్వేషించే పనిలో భారతీయులు ఉన్నారు.మనకు అత్యంత సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్‌లోనూ( Israel ) భారతీయ వలసల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ టూరిజం మంత్రిత్వ శాఖ (ఐఎంవోటీ) భారతీయ ప్రయాణీకుల కోసం డిజిటల్ ఈ- వీసా( e-Visa ) వ్యవస్ధను ప్రవేశపెట్టింది.ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.

కొత్త విధానంలో వ్రాతపనిని తొలగిస్తూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.పర్యాటక సౌలభ్యాన్ని పెంపొందించడానికి, భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ నిబద్ధతలో ఇది కీలకమైన దశను సూచిస్తుంది.

Telugu Indian, Israel Visa, Israelvisa, Israel, Israel India, Israel Tourism-Tel

ఈ-వీసా ఫ్లాట్‌ఫాం ద్వారా భారతీయులు( Indians ) పూర్తిగా ఆన్‌లైన్‌లో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుదారులు ఇజ్రాయెల్ అధికారిక ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.సిస్టమ్‌లో డాక్యుమెంటేషన్ అవసరాలు తగ్గాయి, ఇది వ్యక్తిగత పర్యాటకులకు( Tourists ) ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉంటుంది.అయితే గ్రూప్ వీసా దరఖాస్తులను మాత్రం సంప్రదాయ పద్ధతుల ద్వారానే ప్రాసెస్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.

Telugu Indian, Israel Visa, Israelvisa, Israel, Israel India, Israel Tourism-Tel

ఈ-వీసా ఫ్లాట్‌ఫాంను ఇజ్రాయెల్ ఎంట్రీ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ) సిస్టమ్‌తో అనుసంధానించారు.ఇజ్రాయెల్ పర్యాటక రంగానికి భారతదేశం కీలక మార్కెట్ అన్న సంగతి తెలిసిందే.2018లో 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వగా.కోవిడ్ 19 విజృంభణతో ఈ జోరుకు అంతరాయం ఏర్పడింది.2022 నుంచి తిరిగి భారతీయులు కోలుకోవడం ప్రారంభించారు.ఆ ఏడాది 30,900కి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌ను సందర్శించినట్లు అంచనా.

2023లో 41,800 మంది , 2024లో జనవరి నుంచి అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు ఇజ్రాయెల్‌కు వచ్చినట్లు ఆ దేశ పర్యాటక శాఖలోని ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అమృత బంగేరా ఇటీవల మీడియాకు వివరించారు.ప్రస్తుతం భారతీయ పౌరులకు మాత్రం ఈ- వీసా విధానం అందుబాటులో ఉండగా.

దీనిని విదేశీ ప్రయాణీకులందరికీ విస్తరించాలని ఇజ్రాయెల్ పర్యాటక శాఖ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube