మామిడి పండ్లు తిన‌డానికి స‌రైన స‌మయం ఏది.. రాత్రిపూట ఎందుకు వాటిని తిన‌కూడ‌దు?

ప్రస్తుత వేసవి కాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లే( Mangoes ) కనువిందు చేస్తుంటాయి.కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలవబడే మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

 What Is The Best Time To Eat Mangoes Mangoes, Mangoes Health Benefits, Latest Ne-TeluguStop.com

మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు టన్నుల కొద్ది ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.అయితే మామిడి పండ్ల విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి.

అవి ఏంటి.? అసలు మామిడి పండ్లు తినడానికి సరైన సమయం ఏది.? రాత్రిపూట మామిడి పండ్లను ఎందుకు తినకూడదు.? వంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లు తింటే బ‌రువు పెరుగుతార‌ని..లావుగా మార‌తార‌ని కొంత మంది బ‌లంగా న‌మ్ముతారు.కానీ వాస్త‌వం ఏంటంటే.

మామిడి పండ్లను మితంగా తింటే ఏమాత్రం బరువు పెరగ‌రు.పైగా మామిడి పండ్లలో ఫైబర్( Fiber ) మెండుగా ఉంటుంది.

ఇది మీకు సంతృప్తి కలిగిస్తుంది.ఆక‌లి కోరిక‌ల‌ను అణిచివేస్తుంది.

అయితే మామిడిపండ్లను స్మూతీస్, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌ల రూపంలో తీసుకుంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు.

Telugu Tips, Latest, Mango, Fruits, Timeeat-Telugu Health

అలాగే మామిడి పండ్లు తింటే మొటిమ‌లు( Pimples ) వ‌స్తాయ‌ని కొంద‌రు అంటుంటారు.కానీ అందుకు ఎటువంటి ఆధారాలు లేవు.నిజానికి మామిడి పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందమైన చర్మాన్ని కలిగి ఉండేందుకు కూడా సహాయపడతాయి.

మామిడి పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్ ఎ, విట‌మిన్ సి వంటి పోషకాలు చర్మం యొక్క బయటి పొరపై రక్షిత అవరోధాన్ని సృష్టిస్తాయి.అంటువ్యాధులు మరియు బ్రేక్ అవుట్‌లను దూరంగా ఉంచుతాయి.

సహజంగా చ‌ర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.అకాల వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి.

Telugu Tips, Latest, Mango, Fruits, Timeeat-Telugu Health

ఇక రాత్రిపూట పొర‌పాటున కూడా మామిడిపండ్లను తిన‌కూడ‌దు.ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య మామిడి పండ్లను తినడానికి ఉత్తమ సమయం.మనలో చాలా మంది భోజనం తర్వాత మామిడి పండ్లను డెజర్ట్‌గా తింటారు.

కానీ ఇక‌పై ఈ రుచికరమైన పండును రెండు భోజనాల మధ్య చిరుతిండిగా తీసుకోండి.మ‌రియు మామిడి పండ్ల‌ను తినే ముందు త‌ప్ప‌కుండా వాట‌ర్ లో అర‌గంట పాటు నాన‌బెట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube