టాటూలతో జాగ్రత్త అంటున్న పరిశోధకులు కారణం ఏంటంటే!

ఒకప్పుడు ప్రియమైన వ్యక్తుల పేర్లను చేతిపై పచ్చబొట్టు వేయించుకునేవారు.ఇప్పుడు అదే.

 Tattoos Might Lead To Body's Overheating, Tattoos , Tattoos Health Problems, Bod-TeluguStop.com

టాటూ కల్చర్‌గా మారి అంతటా విస్తరిస్తోంది.ఇపుడు కుర్రకారుల్లో టాటూ ఉంటేనే విలువ అనేలా అయిపోయింది… ప్రజలు తమకు నచ్చిన వాక్యాలు, చిత్రాలు, విభిన్న కళాకృతులను టాటూలుగా వేయించుకుని ఆనందపడ్తున్నారు.

అయితే, ఈ టాటూల వల్ల స్వేద గ్రంథులు దెబ్బతింటాయని, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.శరీరంలో ఉష్ణోగ్రతను స్వేద గ్రంథులు నియంత్రిస్తాయని ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్వేదగ్రంథులు చెమటను విడుదల చేసి బయటకు పంపుతుంటాయి.

తద్వారా ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.అయితే టాటూలు వేసే క్రమంలో సూదులు లేదా టాటూలో ఉండే సిరా చర్మం లోపల ఉండే స్వేద గ్రంథుల్ని దెబ్బతీసే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు.

అలాగే అవి మూసుకుపోయే అవకాశాలున్నాయని తేల్చారు.ఈ పరిణామం వల్ల టాటూ వేసిన చోట చెమట ఉత్పత్తి కాదని, దాని మూలంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.

టాటూ వేసేటప్పుడు చర్మంపై నిమిషానికి 50 నుంచి 3వేల వరకు రంధ్రాలు పడతాయని, వాటి వల్ల స్వేద గ్రంథులు దెబ్బతింటాయని చెప్పారు.పరిశోధనలో భాగంగా కొందరిని టాటూ వేసుకున్న, వేసుకోని వారిగా విభజించి వేడి వాతావరణంలో ఉంచారు.48 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటపాటు నిలబెట్టారు.అయితే, అనుకున్న సమయానికి ఇరు వర్గాల వారికీ చెమటలు పట్టాయి.

కానీ, టాటూ వేసుకోని వారి కంటే టాటూ వేసుకున్న వారి చర్మం నుంచి చెమట చాలా తక్కువ రావడాన్ని పరిశోధకులు గమనించారు.దీంతో ఇపుడు ప్రజలు టాటూ మీద ఉన్న మక్కువ తగ్గించుకుంటే వారికే మంచిదని పరిశోధకులు చెప్పుకొస్తున్నారు, మరి ఇదంతా చూసైయిన ప్రజలు మారుతారో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube