సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.ఓ షాపులో జరిగిన దారుణ ఘటన, ఆపై అక్కడికక్కడే జరిగిన న్యాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు.వీడియోలో చూస్తే, ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న ఓ యువతి( Woman ) షాపులో నిల్చుని ఉంటుంది.
ఇంతలో ఇద్దరు మహిళలు బయటకు వెళ్లడం కనిపిస్తుంది.
కొద్ది క్షణాలకే, ఓ వృద్ధుడు( Oldman ) షాపులోకి వస్తాడు.
అతను నేరుగా ఆ ఎరుపు షర్ట్ యువతి దగ్గరకు వెళ్లి, వెనుక నుంచి ఆమెకు తగులుతూ తన ప్రైవేట్ పార్ట్‌తో అసభ్యంగా రుద్దుతాడు.ఈ ఊహించని నీచమైన పనికి ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడి, తీవ్ర అసౌకర్యానికి గురవుతుంది.
అయితే, ఆమె తేరుకుని ఏదైనా రియాక్షన్ ఇచ్చే లోపే, షాపు ద్వారం దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి ఈ దారుణాన్ని గమనిస్తాడు.ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, అతను ఆ కామాంధుడిపైకి సింహంలా దూసుకెళ్తాడు.అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తాడు.అంతటితో ఆగకుండా, ఆ నీచుడి కాలర్ పట్టుకుని షాపులోని ఓ మూలకు లాక్కెళ్లి, చేసిన తప్పుకు అక్కడికక్కడే దేహశుద్ధి చేస్తాడు.‘ఇన్స్టంట్ జస్టిస్’ అంటే ఇదేనేమో.
ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.ఇప్పటికే లక్షల కొద్దీ వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.నెటిజన్లు ఆ యువకుడి తెగువను, సమయస్ఫూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.“అన్నా నువ్వు రియల్ హీరో” అంటూ కామెంట్లు పెడుతున్నారు.“చేసిన పాపానికి అక్కడికక్కడే శిక్ష పడింది.” అని ఒకరు రాస్తే, “ఇలాంటి కామాంధుల భరతం పట్టడానికి మరింత మంది ఇలాగే ముందుకు రావాలి” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
చాలా మంది ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, ఇలాంటి అసభ్యకరమైన పనికి పాల్పడిన ఆ వృద్ధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు సమాజంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో, వేధింపులకు వ్యతిరేకంగా తక్షణమే ఎలా స్పందించాలో మరోసారి గుర్తు చేస్తున్నాయి.