ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు సినిమా వేడుకలలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతున్నాయి.ఇటీవల లైలా సినిమా వేడుకలో నటుడు పృథ్వి చేసిన వ్యాఖ్యలు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
అయితే ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి నటుడు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ( David Warner ) గురించి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపాయి.డేవిడ్ వార్నర్ పట్ల ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది నెటిజన్స్ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు కురిపించారు.

ఇలా తను చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.ఇందులో భాగంగా రాజేంద్రప్రసాద్ ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు క్షమాపణలు తెలియజేశారు.ఈ వేడుకకు ముందు మేము అందరం కలిసి చాలా సరదాగా మాట్లాడుకున్నాము.
నితిన్,( Nithin ) డేవిడ్ వీళ్ళందరూ కూడా నా పిల్లలతో సమానమే.ఈ వేడుకకు ముందు నువ్వు యాక్టింగ్ లోకి వచ్చావు ఇక్కడ నీ సంగతి చెబుతాను అంటూ నేను సరదాగా మాట్లాడితే డేవిడ్ కూడా నువ్వు క్రికెట్ లోకి రా నీ సంగతి చెబుతా అంటూ సరదాగా మాట్లాడాము.

ఐ లవ్ డేవిడ్… ఐ లవ్ క్రికెట్, డేవిడ్ లవ్స్ అవర్ ఫిలిమ్స్ అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.అయితే డేవిడ్ గురించి నేను మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా నా నోటి నుంచి ఒక మాట దొర్లింది.అది ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడింది కాదు.నేను చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారందరూ దయచేసి నన్ను క్షమించండి ఇకపై ఇలాంటి తప్పులు జరగవు.
అలాగే మార్చి 28వ తేదీ మీరందరూ వచ్చి తప్పకుండా రాబిన్ హుడ్ ( Robin Hood ) సినిమా చూడండి అంటూ రాజేంద్రప్రసాద్ అందరిని కోరారు.