అధిక రక్త పోటు లేదా హైబీపీ నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు చాలా మందిలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న సమస్య ఇది.జీవన శైలిలో మార్పులు, ఆహరాపు అలవాట్లు, మద్యాపనం, ధూమపానం, ఒత్తిడి, ఓవర్ వెయిట్, శరీరానికి శ్రమ లేకపోవడం, ఉప్పూ మరియు కారాలు పరిమితికి మించి తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల హైబీపీ బారిన పడుతున్నారు.
అయితే దీనిని కొందరు చిన్న సమస్యగానే భావిస్తుంటారు.కానీ, బీపీ కంట్రోల్ తప్పి భారీగా పెరిగితే గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అందుకే బీపీని అదుపులో ఉంచుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుంటాయి.అయితే ఇది కేవలం మందులతోనే కాదు కొన్ని కొన్ని ఆహారాలతోనూ సాధ్యమవుతుంది.ముఖ్యంగా కొన్ని కూరగాయలు హైబీపీ బాధితులు డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది.మరి లేటెందుకు ఆ వెజిటేబుల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడదుంపలు రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంచడంలో చిలడగదుంపులు గ్రేట్‌గా సహాయపడతాయి.కాబట్టి, హైబీపీతో ఇబ్బంది పడే వారు చిలగడదుంపలను ఉడికించి తీసుకోవడం ఉత్తమం.
అలాగే బ్రొకోలికీ బీపీని కంట్రోల్ చేసే సామర్ధ్యం ఉంది.
తరచూ బ్రొకోలిని తీసుకుంటే గనుక అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.అంతేకాదు, ఎముకలను బలోపేతం అవుతాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.మరియు మెదడు సైతం చురుగ్గా మారుతుంది.
![Telugu Vegetables, Pressure, Tips, Bp-Telugu Health - తెలుగు హె Telugu Vegetables, Pressure, Tips, Bp-Telugu Health - తెలుగు హె]( https://telugustop.com/wp-content/uploads/2021/08/high-blood-pressure-high-bp-health-health-tips-good-health.jpg)
అధిక రక్త పోటు ఉన్న వారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయల్లో బెండకాయలు ఒకటి.వారానికి రెండు సార్లు బెండకాయలను తీసుకుంటే వాటిలో ఉండే ప్రత్యేకమైన పోషకాలు బీపీని అదుపులో ఉంటాయి.
![Telugu Vegetables, Pressure, Tips, Bp-Telugu Health - తెలుగు హె Telugu Vegetables, Pressure, Tips, Bp-Telugu Health - తెలుగు హె]( https://telugustop.com/wp-content/uploads/2021/08/high-blood-pressure-high-bp-health-health-tips-good-health-blood-pressure.jpg)
క్యారెట్ కూడా అధిక రక్త పోటు స్థాయిలను తగ్గించగలదు.క్యారెట్‌ను జ్యూస్ రూపంలో తరచూ తీసుకుంటే రక్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.మరియు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలూ లభిస్తాయి.
ఇక ఈ కూరగాయలు తీసుకోవడమే కాదు.
మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండండి.ఒత్తిడిని తగ్గించుకోండి.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయండి.మరియు అధిక బరువును తగ్గించుకోండి.
తద్వారా హెల్తీగా ఉండొచ్చు.