భారతీయుల( Indians ) తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఏదైనా సమస్య వస్తే చాలు, క్షణాల్లో ఏదో ఒక ఉపాయం కనిపెట్టేస్తారు.
దాన్నే ‘జుగాడ్’ అంటారు.ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ లవర్స్ అయితే ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.ఇండియన్ ట్రైన్‌లో తీసిన ఈ వీడియోలో ఒక టీ అమ్మే వ్యక్తికి ఒక వింత సమస్య ఎదురైంది.
ఒక ప్యాసింజర్ కిటికీ పక్కన కూర్చుని ఉన్నాడు.ఆ కిటికీకి ఏమో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి.
టీ ఎలా ఇవ్వాలా అని అతను తెగ ఆలోచించాడు.కానీ మనోడు ఊరుకుంటాడా? అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టాడు.
ముందుగా ఒక పేపర్ కప్పు( paper cup ) తీసుకున్నాడు.దాన్ని చిన్నగా ముద్దలా చేశాడు.కిటికీ రంధ్రంలోంచి దూర్చాడు.ప్యాసింజర్ ఆ కప్పుని లోపల నెమ్మదిగా విప్పుకున్నాడు.
అంతే, మళ్లీ కప్పు మామూలు సైజుకి వచ్చేసింది.ఆ తర్వాత టీ అమ్మే వ్యక్తి తన టీ కెటిల్( A tea kettle ) ముక్కుని ఆ రంధ్రంలో పెట్టి వేడి వేడి చాయ్ పోసేశాడు.
కొద్ది క్షణాల్లోనే కిటికీ తెరవకుండా, బయటకు రాకుండానే ప్యాసింజర్ కి టీ అందిపోయింది.ఇది చాలా తెలివైన టెక్నిక్ కదూ.ఈ వీడియోని మొదట గుజరాతీలో( Gujarati ) ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.దానికి క్యాప్షన్ “ఈ టెక్నిక్ ఇండియా బయట ఎవరూ ట్రై చేయలేదు” అని నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.
టీ అమ్మే వ్యక్తి టెక్నిక్ చూసి నెటిజన్లు షాకయ్యారు.కామెంట్ సెక్షన్ మొత్తం పొగడ్తలతో, నవ్వులతో నిండిపోయింది.
ఒక యూజర్ “ఇదే కదా ఇండియన్ జుగాడ్ అంటే, సూపర్ టాలెంట్!” అని మెచ్చుకున్నాడు.మరో యూజర్ కాస్త ఫన్నీగా, “అందుకే ఈ టెక్నిక్ ఇండియా బయట పనిచేయదు.” అని నవ్వేశాడు.కొంతమంది ప్రాక్టికల్‌గా ఆలోచించారు.“ఒకవేళ ఈ ట్రైన్ కి గాజు కిటికీలు పెడితే, ఈ బిజినెస్ క్లోజ్ అంతే సంగతులు” అని ఒకరు కామెంట్ పెట్టారు.కొందరు నవ్వేశారు.ఒక యూజర్ “హ్యాకర్ అల్ట్రా ప్రో మ్యాక్స్”( Hacker Ultra Pro Max ) అని కామెంట్ చేస్తే, ఇంకొకరు “డిస్పోజబుల్ కప్పుని ఇంత బాగా ఎవరూ వాడలేరు” అని కామెంట్ చేశారు.“ఇండియా బిగినర్స్ కోసం కాదు బాబోయ్” అని ఒక యూజర్ అంటే, “సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది” అని ఇంకొకరు యాడ్ చేశారు.
అయితే అందరూ పాజిటివ్ గానే స్పందించలేదు.ఒక ట్రావెలర్ కాస్త సీరియస్ గా, “రెగ్యులర్ గా ప్రయాణం చేసేవాళ్లకి తెలుసు.ఆ గ్యాప్స్ లోంచి ఉమ్ములు వేస్తారని” కామెంట్ పెట్టారు.ఏదేమైనా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో రెండు మిలియన్ల వ్యూస్ దాటేసింది.టీ అమ్మే వ్యక్తి ‘చాయ్ జుగాడ్’ మరోసారి ఇండియన్ తెలివితేటలు, క్రియేటివిటీని ప్రపంచానికి చాటి చెప్పింది.