డ్రై స్కిన్‌తో వ‌ర్రీ అవుతున్నారా? అయితే ఈ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ మీకే!

డ్రై స్కిన్‌. ఎంద‌రినో స‌త‌మ‌తం చేసే స‌మ‌స్య ఇది.

 This Natural Moisturizer Helps To Get Rid Of Dry Skin Details, Natural Moisturiz-TeluguStop.com

కొంద‌రి చ‌ర్మం కేవ‌లం చ‌లికాలంలో మాత్ర‌మే పొడిగా మారుతుంటుంది.కానీ, కొంద‌రు చ‌ర్మం సీజ‌న్‌తో ప‌ని లేకుండా ఎప్పుడూ డ్రైగానే ఉంటుంది.

డ్రై స్కిన్ వ‌ల్ల చ‌ర్మం నిర్జీవంగా, డల్ గా కనబడుతుంది.అందుకే డ్రై స్కిన్‌ను వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

మీరు కూడా డ్రై స్కిన్ తో వ‌ర్రీ అవుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను మీరు వాడాల్సిందే.ఈ మాయిశ్చ‌రైజ‌ర్ చ‌ర్మం ఎంత డ్రైగా ఉన్నా మృదువ‌గా మ‌రియు కాంతివంతంగా మారుస్తుంది.మ‌రి ఇంకెందుకు లేటు ఆ మాయిశ్చ‌రైజ‌ర్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, నాలుగు చుక్క‌లు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హోమ్ మేడ్ మాయిశ్చ‌రైజ‌ర్ సిద్ధం అవుతుంది.ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను ఏదైనా బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు యూస్ చేసుకోవ‌చ్చు.

మాయిశ్చ‌రైజ‌ర్ ను రోజుకు రెండు సార్లు గ‌నుక వాడితే డ్రై స్కిన్ మృదువుగా, తేమ‌గా మారుతుంది.అంతేకాదు, ఈ మాయిశ్చ‌రైజ‌ర్ ను యూస్ చేయ‌డం వ‌ల్ల‌ నిర్జీవంగా, డల్ గా ఉండే చ‌ర్మం కాంతివంతంగా మ‌రియు షైనీగా మారుతుంది.

Telugu Tips, Dry Skin, Latest, Moisturizer, Skin Care-Telugu Health

ఇక ఈ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడ‌టంతో పాటు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా శ‌రీరానికి స‌రిప‌డా వాట‌ర్‌ను అందించాలి.తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, న‌ట్స్ వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా స్నానం చేయ‌డానికి గంట ముందు ముఖాన్ని ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకోవాలి.

త‌ద్వారా డ్రై స్కిన్‌కు స‌హ‌జంగానే బై బై చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube