ఆరోగ్యానికి పోషకాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో నిద్ర( Sleep ) కూడా అంతే అవసరం.నిద్ర శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
కంటి నిండా నిద్రపోవడం వల్ల 90 శాతం రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతారు.అంటే నిద్రకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
అయితే ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, స్మార్ట్ ఫోన్ లను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో( Insomnia ) బాధపడుతున్నారు.మరికొందరిలో నిద్ర నాణ్యత అనేది తగ్గిపోతుంది.
దీని కారణంగా రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పోలేకపోతుంటారు.
అయితే మంచి నిద్రను ప్రమోట్ చేయడానికి కొన్ని పానీయాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.
ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూడా ఆ కోవకు చెందిందే.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక చిటికెడు కుంకుమపువ్వు,( Saffron ) రెండు లవంగాలు( Cloves ) మరియు రెండు దంచిన యాలకులు( Cardamom ) వేసుకొని పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ ను నేరుగా సేవించొచ్చు లేదా రుచికి సరిపడా తేనె( Honey ) కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

ఈవినింగ్ టైంలో ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి.నిద్ర నాణ్యతను పెంచుతాయి.నిద్ర హార్మోన్లను ప్రభావితం చేసి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తాయి.
అలాగే ఈ డ్రింక్ తయారీలో ఉపయోగించిన కుంకుమపువ్వు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
చర్మం కాంతివంతంగా మారుస్తుంది.

లవంగాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడానికి తోడ్పడతాయి.ఇక యాలకులు జీర్ణశక్తిని పెంచుతాయి.శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
నోటి దుర్వాసనను తొలగిస్తాయి.మధుమేహ నియంత్రణకు కూడా మద్దతు ఇస్తాయి.