న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించినా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్నారు.ఈ తరం ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడం ద్వారా నాని తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
న్యాచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.నాని సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తున్నాయి.
క్లాస్ సినిమాలో నటించినా మాస్ సినిమాలో నటించినా నాని మాత్రం సినిమాకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.కెరీర్ విషయంలో నాని ప్లాన్స్ మాత్రం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
నాని ప్రస్తుతం హిట్3 సినిమాతో( Hit 3 Movie ) బిజీగా ఉన్నారు.శైలేష్ కొలను( Sailesh Kolanu ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నాని శైలేష్ కొలను కాంబో మూవీ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.హిట్1, హిట్2 సక్సెస్ సాధించినా కమర్షియల్ గా మరీ అద్భుతాలు చేయలేదు.హిట్3 సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాల్సి ఉంది.హిట్3 సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.నాని హిట్3 సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

శైలేష్ కొలను గత సినిమా సైంధవ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే నిర్మాతలకు సైతం సైంధవ్ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది.వెంకటేశ్ తన శైలికి భిన్నమైన కథను ఎంచుకోవడం వల్లే సైంధవ్ మూవీ ఫ్లాప్ గా నిలిచిందని భావిస్తారు.శైలేష్ కొలను తర్వాత సినిమాలతో ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మర్డర్లకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.హిట్ సిరీస్ లో భాగంగా మొత్తం ఏడు సినిమాలను తెరకెక్కిస్తానని శైలేష్ కొలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.