ఆ హీరోయిన్ కు వాలంటైన్స్ డే గిఫ్ట్ గా ప్రైవేట్ జెట్.. వామ్మో ప్రేమను ఇలా చాటుకున్నాడా?

సుఖేష్ చంద్రశేఖర్ ( Sukesh Chandrasekhar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మనీ ల్యాండరింగ్ కేసులో( money laundering case ) ఒకప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే.

 Sukesh Chandrasekhar Gifts A Private Jet To Jacqueline, Jacqueline Fernadez, Suk-TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సుఖేష్ చంద్రశేఖర్ పేరు ఒక రేంజ్ లో మారుమోగింది.కోట్లల్లో స్కాన్ చేసి ఎంతో మందిని మోసం చేసి జైలు పాలైన విషయం తెలిసిందే.

ఇక ఈయన పేరుతో పాటు ఆ సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్.ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అయినా ఈమెకు సుఖేష్ చంద్రశేఖర్ కోట్లు విలువ చేసే కానుకలు ఇచ్చాడు అంటూ ఆమెను కూడా అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Private Jet, Sukeshchandra-Movie

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ప్రేమికుల దినోత్సవం ( Valentine’s Day )సందర్భంగా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అత్యంత ఖరీదైన బహుమతిని అందుకుంది.ఆమెకు ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని బహుమతిగా అందించాడు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్.అంతే కాదు జైలు నుంచే ఆమెకు ఏకంగా ప్రేమ లేఖ రాశాడు.తను రాసిన ఉత్తరంలో జాక్వెలిన్ ను బేబీగా సంబోధించాడు సుఖేష్.ఆమెకు ప్రేమికుల రోజులు శుభాకాంక్షలు చెబుతూనే, బహుమతిగా ఒక ప్రైవేట్ జెట్ ( A private jet )ను కానుకగా ఇస్తున్నట్టు అందులో రాశాడు.ఆ జెట్ పై ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పరని, ఎందుకంటే దానికి గిఫ్ట్ ట్యాక్స్ కట్టానని, అంతా లీగల్ గా ఉందని లేఖలో పేర్కొన్నాడు సుఖేష్.

Telugu Bollywood, Private Jet, Sukeshchandra-Movie

తన ప్రేమకు గుర్తుగా విమానంపై జాక్వెలిన్( Jacqueline ) పేరు రాయించాడట సుఖేష్.అంతేకాదు జాక్వెలిన్ పుట్టినరోజు కలిసొచ్చేలా రిజిస్ట్రేషన్ చేయించాడట.అయితే జాక్వెలిన్ కు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.గతంలో ఆమె పుట్టిన రోజుకు ఒక పెద్ద పడవను బహుమతిగా అందించాడు.మొన్న జరిగిన క్రిస్మస్ కు ఏకంగా పారిస్ లోని ఒక వైన్ యార్డ్ ను బహుమతిగా అందించాడు.మరో జన్మ అంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా జన్మిస్తానని లేఖలో పేర్కొన్నాడు సుఖేష్.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.అసలు సుఖేష్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తన ప్రియుడు కాదని వాదిస్తోంది జాక్వెలిన్.

కోర్టు ముందు కూడా ఇదే విషయం చెప్పింది.ఇటువైపు నుంచి సుఖేశ్ మాత్రం ఆమెకు లేఖలు రాస్తున్నాడు.అలాగే ఖరీదైన బహుమతులు కూడా అందిస్తున్నాడు.200 కోట్ల రూపాయల దోపిడీ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు సుఖేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube