ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న క్యాబేజీలో కొత్త ర‌కం.. ఇదే ఏఏ వ్యాధుల ముప్పును త‌ప్పిస్తుందంటే...

హ‌రియాణాలోని కర్నాల్‌లో ఇండో-ఇజ్రాయెల్ సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ రైతులకు శుభ‌వార్త తెలియ‌జేసింది.ఈ సంస్థ‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ప్ర‌జ‌లు తీవ్ర వ్యాధుల బారిన పడకుండా కాపాడే సరికొత్త రంగురంగుల క్యాబేజీని రూపొందించారు.

 A New Variety Of Surprising Cabbage , Cabbage , Colored Cabbage , Dr. Ajay ,co-TeluguStop.com

ఊదా మరియు పసుపు రంగుల క్యాబేజీల‌ను ఉత్ప‌త్తి చేశారు.ఈ రంగుల‌ క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా స్థూలకాయం తగ్గుతుందని, గుండె జబ్బులతో పోరాడడంలో ఇది ఎంత‌గానో ఉపయోగపడుతుందని వివిధ రకాల క్యాబేజీలను తయారు చేసిన శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు.

ఇది కాకుండా ఈ క్యాబేజీకి యాంటీ కార్సినోజెనిక్ సంభావ్యత ఉంద‌ని తెలియ‌జెప్పారు.ఈ రంగురంగుల క్యాబేజీని సాగు చేయడం ద్వారా రైతులు భారీ లాభాలను ఆర్జించవచ్చని వివ‌రించారు.

రంగుల‌ క్యాబేజీకి డిమాండ్ఢిల్లీ వంటి నగరాల్లో రంగు క్యాబేజీకి విపరీతమైన డిమాండ్ ఏర్ప‌డింద‌ని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అందుకే రైతులు తెల్ల క్యాబేజీకి బదులు రంగు క్యాబేజీని పండించాల‌ని కోరుతున్నారు.

తెల్ల క్యాబేజీని పెంచడానికి ఎంతో శ్రమ మరియు అద‌న‌పు ఖర్చులు అవసరం.ఈ రంగు క్యాబీజీల ఉత్ప‌త్తికి అదనపు ఖర్చు అవసరం లేద‌ని, రైతులకు మరింత సమాచారం కావాలంటే త‌మ కేంద్రం వద్దకు రావచ్చని అధికారులు తెలిపారు.

రైతులకు తాజా సమాచారం అందించేందుకు కేంద్రంలో వివిధ రకాల కూరగాయల ప్రదర్శన ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

Telugu Cabbage, Color Capsicum, Colored Cabbage, Dr Ajay, Farmers, Tips-Latest N

ఈ సంద‌ర్భంగా నిపుణుడు డాక్టర్ అజయ్ చౌహాన్ మాట్లాడుతూ ఇంతకుముందు కలర్ క్యాప్సికమ్ ట్రెండ్ వచ్చిందని తెలిపారు.దీంతో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డ‌ట‌మే కాకుండా ఉత్ప‌త్తిదారుల‌కు మంచి లాభాలు వచ్చాయ‌న్నారు.నేటికీ మార్కెట్‌లో రంగుల‌ క్యాప్సికమ్‌ ధర బాగానే ఉంద‌న్నారు.అదే విధానంలో సీఈవీ ఇప్పుడు రంగుల‌ క్యాబేజీ యొక్క ప్రదర్శన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింద‌న్నారు.రంగురంగుల క్యాబేజీ ప్రదర్శనను చూసేందుకు పలువురు రైతులు ఈ కేంద్రానికి త‌ర‌లివ‌స్తున్నారు.రెట్టింపు ధరకు విక్రయ సాధారణంగా తెల్ల క్యాబేజీ కిలో రూ.20 వరకు విక్రయిస్తుండగా, రంగు క్యాబేజీ ధర దానికి రెండింతలు పలుకుతోంది.తెల్ల క్యాబేజీ కంటే రంగు క్యాబేజీకి ఎక్కువ భవిష్యత్తు ఉంది.

డాక్టర్ అజయ్ మాట్లాడుతూ రంగు క్యాబేజీని పండించడానికి రైతులు అత్య‌ధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube