దగ్గు రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి కఫం దగ్గు కాగా.
మరొకటి పొడి దగ్గు.( Dry Cough ) కఫం దగ్గుకు శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది.
పొడి దగ్గుకు శ్లేష్మం ఉండదు.కానీ గొంతులో నొప్పి, మంట, చికాకు ఉంటాయి.
పైగా పొడి దగ్గు అంత త్వరగా తగ్గదు.ముక్కు, గొంతులో ఏర్పడిన అలెర్జీ పొడి దగ్గుకు ప్రధాన కారణం అవుతుంది.
అలాగే కలుషితమైన వాతావరణం, టీబీ, ఉబ్బసం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా పొడి దగ్గు వేధిస్తుంది.ఏదేమైనా పొడి దగ్గు వల్ల కొందరు విపరీతంగా ఇబ్బంది పడతారు.
ఎన్నెన్నో టానిక్స్, మందులు వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ చిట్కా ద్వారా కేవలం రెండు రోజుల్లోనే పొడి దగ్గు పరార్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు,( Coriander Seeds ) రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) ఒక స్పూన్ వాము వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఎనిమిది లవంగాలు, రెండు అంగుళాల దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.చివరిగా అంగుళం ఎండిన అల్లాన్ని కూడా వేసి వేయించాలి.

ఇప్పుడు వేయించుకున్న పదార్థాలు అన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ తోనే పొడి దగ్గుకు మంచి డ్రింక్ తయారు చేసుకోవచ్చు.అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పౌడర్ తో పాటు నాలుగు తులసి ఆకులు, ( Tulsi Leaves ) నాలుగు పుదీనా ఆకులు( Mint Leaves ) వేసి కనీసం 10 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేశారంటే పొడి దగ్గు దెబ్బకు పరారవుతుంది.అలర్జీ, ఇన్ఫెక్షన్ నాశనం అవుతుంది.కేవలం రెండు రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.







