ఈ నూనెతో ఇలా చేస్తే నోటి దుర్వాసనతో పాటు ఇన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయా..?

సాధారణంగా చెప్పాలంటే కొబ్బరి నూనె అనగానే మనం జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటాము.జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో మనం తలకు ఎక్కువగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తూ ఉంటాము.

 If You Do This With This Oil, Along With Bad Breath, Will All The Health Problem-TeluguStop.com

కానీ కొన్ని ప్రాంతాలలో కొబ్బరి నూనె( Coconut oil ) వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు.అయితే మన దంతా సంరక్షణలో( dental care ) కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు.

కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది.దీనిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సంతృప్త కొవ్వు హెలికోబాక్టర్ పైలోరీ, హెలిటోసిస్ దోహదపడే బ్యాక్టీరియా( Bacteria ) వృద్ధిని నిరోధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Bacteria, Soda, Coconut Oil, Care, Gums Teeth, Problems, Lauric Acid, Oil

చిగుళ్లలో మంట చికాకు కలిగించే చిగుళ్ల వ్యాధికి చికిత్స చేస్తుంది. చిగుళ్ళ వాపు కారణంగా దంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది.కొబ్బరి నూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ యాంటీ మైక్రోబయాల్ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి నోటిలోని బ్యాక్టీరియాని తొలగిస్తాయి.కొబ్బరి నూనె పళ్ళ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మీరు మీ దంతాలను తెల్లగా మెరిపించాలనుకుంటే కొబ్బరి నూనె బేకింగ్ సోడాను మిక్స్ చేసి ఆ మిక్స్ తో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్రష్ చేయాలి.

Telugu Bacteria, Soda, Coconut Oil, Care, Gums Teeth, Problems, Lauric Acid, Oil

ఆ తర్వాత గోరు వేచ్చని నీళ్లతో నోరు శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే పళ్ళ ఆరోగ్యానికి ఆయిల్ పుల్లింగ్ ఎంతో మంచిది.ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె నోట్లోకి తీసుకోవాలి.ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆ నూనె నోట్లోని మూల మూలకు వెళ్లేలా చూసుకోవాలి.ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తగా ఉండాలి.

పని పూర్తయ్యాక దాన్ని ఉమ్మి వేయాలి.ఇక ఏదైనా తినే ముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది.

చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి.ఇలాంటి వారు ఆయిల్ ఫుల్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube