సుధీర్ బాబు.సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబుకు స్వయానా బావ.ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు.చక్కటి దేహంతో పాటు అద్భుత నటనతో ముందుకు సాగుతున్నాడు.తాజాగా వీ సినిమాతో జనం ముందుదకు వచ్చాడు.అయితే తన మామ సూపర్‌స్టార్ కృష్ణ, బావ మహేశ్‌బాబు సపోర్టు ఏనాడు తీసుకోలేదు.సినిమాల్లోకి రావడానికైనా.
వచ్చాక నిలదొక్కుకోవడంలో వారి మద్దతు తీసుకోలేదు.స్వయంశక్తితో సక్సెస్ ఫుల్ గా సినీ కెరీర్ కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే సక్సెస్ అయ్యాడు కూడా.
సుధీర్ బాబు 2006లో కృష్ణ కుమార్తె ఘట్టమనేని ప్రియదర్శిణిని వివాహం చేసుకున్నాడు.
అనంతర్ 2010లో ఏ మాయ చేసావె సినిమాతో సినిమా కెరీర్ మొదలు పెట్టాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు సమంత బ్రదర్ గా యాక్ట్ చేశాడు.
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు.ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆయన కెరీర్ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
అటు సినిమాల్లోకి రాక ముందు సుధీర్ బాబు కుటుంబం పురుగుల మందు బిజినెస్ చేసేది.అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ గా చేశారు.
ఇక పురుగుల మందు బిజినెస్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ బాబు సినిమా రంగం వైపు అడుగులు వేశాడు.
కృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.అనంతరం సినిమారంగంలోకి వచ్చాడు.అయితే సినిమాల్లోకి రావడనాకి రికమండేషన్ తీసుకునే అవకాశం ఉన్నా.
ఆయన వాడుకోలేదు.కృష్ణ, మహేష్ బాబు మద్దతు లేకుండానే సినిమాల్లోకి వచ్చాడు.
వారి సపోర్టు తీసుకుంటే పెళ్లి చేసుకున్నందుకు కట్నం తీసుకున్నట్లే అవుతుందని చెప్తాడు సుధీర్ బాబు.అందుకే తాను వారి మద్దతు తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు.