భారత సంతతికి చెందిన న్యాయమూర్తిపై అమెరికాలో( America ) అవినీతి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.ఫోర్ట్ బెండ్ కౌంటీకి జడ్జిగా( Fort Bend County Judge ) వ్యవహరిస్తోన్న కేపీ జార్జ్‌పై( Judge KP George ) మోసం, ప్రచార ఆర్ధిక నివేదికను తప్పుగా చూపించడం సహా రెండు మనీలాండరింగ్( Money-Laundering ) ఆరోపణలపై శుక్రవారం అరెస్ట్ చేశారు.2018 నుంచి కౌంటీ జడ్జిగా పనిచేసి 2022లో తిరిగి ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జార్జ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు కౌంటీ జైలులో ఉంచి 20 వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు.ఆ అభియోగాలపై ఆయనపై గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ అభియోగాలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని కేపీజార్జ్ తెలిపారు.న్యాయ వ్యవస్ధపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన అన్నారు.డీఏ కార్యాలయం అనుచితంగా వ్యవహరించిందని జార్జ్ వ్యాఖ్యానించారు.కోర్టు రికార్డులు , ఫోర్ట్ బెండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ప్రకారం జార్జ్.30 వేల అమెరికా డాలర్ల నుంచి 1,50,000 మధ్య లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జార్జ్ చేసిన ఆరోపణలను డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తిరస్కరించింది.చట్టపరమైన , నైతిక ప్రమాణాలకు అనుగుణంగా దర్యాప్తు నిర్వహించబడిందని తెలిపింది.మరోవైపు.ఈ అరెస్ట్ జార్జ్‌పై రాజకీయ ఒత్తిడిని తీవ్రతరం చేసింది.ఫోర్ట్ బెండ్ కౌంటీ ట్రెజరర్. బిల్ రిక్టర్ మాట్లాడుతూ నకిలీ జాత్యహంకార కుంభకోణాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామాకు బహిరంగంగా పిలుపునిచ్చారు.
ఫోర్ట్ బెండ్‌లో మలయాళీలతో సహా భారతీయులు అధిక సంఖ్యలో స్ధిరపడ్డారు.ఇక్కడ 28.6 శాతం మంది విదేశీయులు వుంటే వారిలో 51 శాతం మంది ఆసియా అమెరికన్లే.
హ్యూస్టన్‌లోని ఎటర్నల్ గాంధీ మ్యూజియం (ఈజీఎంహెచ్) అభివృద్ధికి కేపీ జార్జ్ తన వంతు కృషి చేశారు.
ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో భారతీయ కమ్యూనిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.మరి ఈ ఆరోపణల నుంచి కేపీ జార్జ్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.