తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ హీరోలు అందరూ భారీ విజయాలను అందుకుంటున్నారు.మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు తను చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సూపర్ సక్సెస్ లను సాధించడానికి బరిలోకి దిగుతున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన సుకుమార్( Sukumar ) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఒక కథ రెడీ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయింది.అయినప్పటికి వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండడంతో మరో సినిమా చేయాలని అనుకున్నారు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు.

దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమాని పూర్తి చేసిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ తదుపరి సినిమాలతో భారీ విజయాలను అందుకొని తన మార్కు ను మరింత స్ట్రాంగ్ ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.