ఆ వార్తలు చదివి కన్నీళ్లు పెట్టుకున్నాను.. తమన్నా సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

 Tamannaah Bhatia Talks About Her Career In Recent Interview Details, Tamannaah B-TeluguStop.com

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి మెప్పించింది.

ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా నటించిన చిత్రం ఓదెల 2.( Odela 2 ) ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Tamanna, Odela, Tamanna Number, Tamanna Odela, Tamannaah, Tamannaahcareer

ముఖ్యంగా తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తమన్నా.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.పదో తరగతిలో ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.

చదువుల్లో టీచర్లు నాకెంతో సహాయం చేసేవారు.ఒక్కొసారి వాళ్లే నా అసైన్‌మెంట్స్‌ పూర్తి చేసేవారు.

వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలినే.నిజ జీవితంలో నేను కాలేజీకి వెళ్లలేదు.

కానీ రీల్‌ లైఫ్‌ లో మాత్రం కాలేజీ స్టూడెంట్‌ గా నటించాను.సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది.

అందుకు ఎంతో ఆనందంగా ఉంది.కెరీర్‌ ఆరంభించినప్పుడు ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదు.

Telugu Tamanna, Odela, Tamanna Number, Tamanna Odela, Tamannaah, Tamannaahcareer

నా 21వ పుట్టినరోజు నాడు జరిగిన ఒక సంఘటన ఏ మాత్రం మర్చిపోలేను.పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని ఇంట్లోనే ఉన్నాను.అప్పుడు నాపై పత్రికల్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది.తమిళంలో నంబర్‌ 1 నటి అనేది అందులోని సారాంశం.అది చదువుతూ నేను కన్నీళ్లు పెట్టుకున్నాను.త్వరగా ఆ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు.

నంబర్‌ 1 స్థానానికి వెళ్లాక అక్కడే కొనసాగడం అంత సులభం కాదనిపించింది.అదొక బాధ్యతగా తీసుకున్నాను.

ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయాలని అనుకున్నాను.ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపింది తమన్నా.

ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఓదెల 2 సినిమాకు అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో తమన్నా శివ శక్తిగా కనిపించనున్నారు.సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు.ఏప్రిల్‌ 17 న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా బోలెడు అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube