ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఈయన నటించిన పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.ఇక సినిమా కోసం సుమారు 350 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇలా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదించడమే కాకుండా ఈయన మరోవైపు భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నో పెట్టుబడులలో భాగస్వామ్యం అయిన అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్లో మరో థియేటర్ ( Theatre ) నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.తాజాగా ఈ థియేటర్ కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్టు సమాచారం.ఈ పూజ కార్యక్రమాలలో అల్లు బ్రదర్స్ పాల్గొన్నారు.
కోకాపేట్ ఏరియాలో అల్లు స్టూడియోస్( Allu Studios ) పేరుతో కొత్త థియేటర్ నిర్మాణం ప్రారంభమైంది.ఈ థియేటర్ లో 4కే స్క్రీన్ తోపాటు డాల్బీ సౌండ్ సిస్టంని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకూ హైదరాబాద్ లోని ఏ థియేటర్ లోనూ డాల్బీ సౌండ్ సిస్టం లేదనే చెప్పాలి.

మొదటిసారి అల్లు అర్జున్ నిర్మించబోయే థియేటర్లో ఈ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నారు.అల్లు అర్జున్ అమీర్ పేట్ లో ఏషియన్ సత్యం మాల్ లో భాగస్వామిగా.అదేవిధంగా అల్లు స్టూడియోస్ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా సినిమాలలో సంపాదిస్తూ వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతూ బన్నీ భారీగా ఆస్తులను కూడబెడుతున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తోంది.