ప్రస్తుతం తెలుగులో ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.వాటిలో నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతోంది కార్తీకదీపం సీరియల్.
( Karthikadeepam ) ఇప్పటికే ఈ సీరియల్ పార్ట్ 1 ప్రసారం అయినా విషయం తెలిసిందే.ప్రస్తుతం కార్తీకదీపం 2( Karthikadeepam 2 ) సీరియల్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సీరియల్ తెలివిజన్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సీరియల్ గా టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.ఈ సీరియల్ కంటే ముందు తర్వాత చాలా సీరియల్స్ ప్రసారమయ్యాయి.
కానీ ఈ సీరియల్ కు దక్కిన ఆదరణ మరే సీరియల్ కు దక్కలేదని చెప్పాలి.

ఈ సీరియల్ నటించిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తింపు దక్కింది.మరి ముఖ్యంగా హీరోయిన్ వంటలక్కగా( Vantalakka ) చేసిన ప్రేమి విశ్వనాథ్( Premi Viswanath ) తెలుగులో భారీగా అభిమానులను సంపాదించుకుంది.మలయాళ నటి అయిన ప్రేమి విశ్వనాథ్.2014 నుంచి సీరియల్స్ చేస్తోంది.మొదట సొంత భాషలో చేసింది.2017 నుంచి మాత్రం తెలుగులో కార్తీకదీపం చేస్తోంది.2023 వరకు కొనసాగిన ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంది.ప్రస్తుతం రెండో సీజన్ అని నడిపిస్తున్నారు.300కి పైగా ఎపిసోడ్లు ప్రసారం చేశారు గానీ తొలి పార్ట్ అంత బజ్ సొంతం చేసుకోలేకపోయింది.

అయితే ప్రస్తుతం పార్ట్ 2 ప్రసారం అవుతున్నప్పటికీ ఎందుకో తెలియదు గానీ పార్ట్-1 అంత సక్సెస్ కాలేక పోయింది.ఇకపోతే సీరియల్ గురించి పక్కనబెడితే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిసీ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.ఈమె రోజుకి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తోందట.నెలలో దాదాపు 20 నుంచి 25 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది.తద్వారా లక్షల్లోనే పారితోషికం అందుకుంటోంది.రెమ్యునరేషన్ విషయంలో వంటలక్క తర్వాత సుజిత, కస్తూరి లాంటి ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది.ఏదేమైనా ఏళ్లు గడుస్తున్నా వంటలక్క క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
అయితే ప్రేమి విశ్వనాధ్ కేవలం ఈ సీరియల్ లో మాత్రమే నటిస్తుందా లేదంటే ముందు ముందు మరిన్ని సీరియల్స్ లో నటిస్తుందా లేదా అనేది చూడాలి మరి.







