టాలీవుడ్ హీరో స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు( Allu Arjun Birthday ) కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే ఈ పుట్టినరోజు నాడు బన్నీ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన రానుంది.
ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజున బన్నీ సినిమాలకు సంబంధించి ప్రకటన రానుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2( Pushpa 2 ) తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలు నటిస్తున్నారు.సినిమా పేరేంటి ఎప్పుడు విడుదల కాబోతోంది ఇలాంటి ఎన్నో విషయాలపై ఆసక్తి నెలకొంది.
అయితే ఈ విషయాలన్నింటికి సమాధానం ఏప్రిల్ 8న తెలియనుంది.

అయితే అదే రోజు బన్నీతో పాటు మరో హీరో కూడా తన కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడు.అతడే అఖిల్ అక్కినేని.( Akhil Akkineni ) చాన్నాళ్లుగా లైమ్ లైట్ కు దూరంగా ఉన్నారు అక్కినేని అఖిల్.
ఏజెంట్ ఫ్లాప్ అతడ్ని కుంగదీసింది.అయితే ఆ సినిమాపై చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్, అది ఫ్లాప్ అవ్వడంతో తట్టుకోలేకపోయాడు.
అందుకే ఇప్పటి వరకు మరో సినిమా ఒప్పుకోలేదు.కానీ ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటపడి ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించబోతున్నాడట.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయబోతున్నాడట.

ఈ ప్రకటననే ఒక వీడియో రూపంలో 8వ తేదీన విడుదల చేయబోతున్నారట.అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాతో తొలిసారి అన్నపూర్ణ స్టుడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ చేతులు కలుపుతున్నాయి.రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు 8న తెలుస్తాయి.
మరి ఏప్రిల్ 8న ఇద్దరు హీరోలకు సంబంధించిన మూవీ అప్డేట్లు విడుదల అవుతాయో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.అఖిల్ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.