వైశాఖ మాసంలో ఈ విధంగా పూజిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసాలలో వైశాఖమాసం ( Vaishakam ) కూడా ఒకటి.ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలమైనదిగా చెబుతారు.

 Vaishaka Masam Pooja Rituals Sri Maha Vishnu Details, Vaishaka Masam ,pooja Ritu-TeluguStop.com

అంతేకాకుండా దీనిని సాధన మాసంగా కూడా పిలుస్తారు.వైశాఖం, మాఘం, కార్తీకం ఈ మూడు మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు కూడా చెప్పారు.

అలాగే కార్తీక పురాణం, మార్గపురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం( Vaishaka Puranam ) కూడా ఉనికిలో ఉంది.అయితే దీనిని పేద వ్యాసుడు రచించడం జరిగింది.

అయితే వసంత రుతువులో వైశాఖం రెండో మాసం.దీనిని మాధవ మాసం( Madhava Masam ) అని కూడా పిలుస్తారు.మధు అంటే చైత్రమాసానికి మాధవ అని వైశాఖ మాసానికి పేర్లు.వైశాఖమాసం నాడు లక్ష్మీనారాయణ ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది.

అయితే ఈ ఏడాది వైశాఖమాసం మే 5వ తేదీ వరకు ఉంది.ఇక ఈ నెల చివరి రోజున అంటే పౌర్ణమి రోజున చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు.

కాబట్టి దీనిని వైశాఖమాసం అని అంటారు.

కాబట్టి ఈ మాసంలో పుణ్యా స్నానం, దానాలు, ఉపవాసం, పూజలు చేయడం వలన పుణ్య ఫలాలు పుష్కలంగా లభిస్తాయి.అందుకే ఈ పవిత్ర మాసంలో పుణ్య స్నానాలు, దానాలు చేయడంతో పాటు మరీ ముఖ్యంగా రెండు వ్రతాలు ఆచరించాలని మన వేద పండితులు చెబుతున్నారు.అయితే వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దలాలతో పూజించాలి.

అయితే ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి.ఇక దీనిని విష్ణువుకు సమర్పించాలి.ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా అయ్యేంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణులు అంత పుణ్యాన్ని ఈ పూజ చేయడం వలన ఇస్తాడని చెబుతారు.ఈనెల పొడవునా అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి.

ఇలా చేయడం వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది.అలాగే పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube