బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కంగనా రనౌత్( Kangana Ranaut ) ఒకరు.వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కంగనా రనౌత్ తాజాగా చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఎమర్జెన్సీ సినిమాను( Emergency Movie ) ప్రశంసిస్తూ ఒక వ్యక్తి లేఖ రాయగా ఆ లేఖను కంగనా రనౌత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.నిత్యానందం అనే వ్యక్తి కంగనాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలాంటి పవర్ ఫుల్ సెబ్జెక్ట్ ను ఎలాంటి బెరుకు లేకుండా చూపించిన కంగనను నిత్యానందం మెచ్చుకున్నారు.కంగనా రనౌత్ కు బహుమతిగా ఒక్ కాంచీపురం చీరను( Kanchipuram Saree ) సైతం ఇవ్వడం కొసమెరుపు.
అతడు రాసిన ఇన్ స్టాగ్రామ్ లేఖ గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ ఆ గిఫ్ట్ తనకు ఎంతో విలువైనదని చెప్పుకొచ్చారు.ఎమర్జెన్సీని రూపొందించినందుకు అద్భుతమైన చీరను పొందానని పేర్కొన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డుల వేడుకను ఉద్దేశించి కంగనా రనౌత్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.గతంలో సైతం కంగనా రనౌత్ పలు సందర్భాల్లో ఇదే తరహా కామెంట్లు చేశారు.అర్హత ఉన్నవాళ్లకు అవార్డులు ఇవ్వరని కంగనా రనౌత్ పేర్కొన్నారు.అవార్డుల కార్యక్రమాలలో నెపోటిజంకు ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

కంగనా రనౌత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.కంగనా రనౌత్ రాబోయే రోజుల్లో భారీ విజయాలను సొంతం చేసుకోవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కంగనా రనౌత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.కంగనా రనౌత్ కు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కంగనా రనౌత్ భవిష్యత్తులో నటించే సినిమాలు సైతం హిట్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







