విద్యాబాల‌న్ వెండితెర‌పైకి రాక‌ముందు ఏం చేసేవారంటే...

బాలీవుడ్ న‌టి విద్యాబాలన్ భారతీయ సినిమాకి ల‌భించిన గొప్ప వ‌రం అని చెబుతుంటారు.ఇటీవ‌లే విద్య‌ తన 43వ పుట్టినరోజు జరుపుకుంది.

 What Did Vidya Balan Do Before Coming To The Silver Screen , Silver Screen, Vid-TeluguStop.com

జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్ తన నటనకు నిరంత‌రం ప్రశంసలు అందుకుంటూనే ఉంది.విద్య ఎంతో జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటుంది.ఆమె ప్రాజెక్ట్‌లు చాలావ‌ర‌కూ విజ‌య‌వంతం అయ్యాయి.2022లో వచ్చిన ఆమె చిత్రం జల్సా కూడా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది.విద్య‌ తన ఇంట్లో తమిళం, మలయాళం రెండు భాషల కలయికతో పెరిగింది.

టీవీలో అరంగేట్రం ఆసక్తికరమైన విషయమేమిటంటే విద్యాబాలన్‌కు చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక తీవ్రంగా ఉండేది.

ఆమె షబానా అజ్మీ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ త‌దిత‌ర ప్రముఖ నటీమణుల చిత్రాల నుండి ఎంతో ప్రేరణ పొందింది.ఎల్లప్పుడూ నటనలోనే కెరీర్‌ను కొనసాగించాలని కోరుకునేది.విద్యాబాలన్ తన 16వ ఏట ఏక్తా కపూర్ షో హమ్ పాంచ్‌తో తొలిసారిగా నటించింది.దురదృష్టవంతురాలు అనే ట్యాగ్ ముంబయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న సమయంలో విద్యాబాలన్‌కు అప్పటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన కథానాయికగా న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

లోహిత దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసే స‌రికే విద్య‌ డజనుకు పైగా చిత్రాలకు సంతకం చేసింది.ప్రకటనలలో విద్యాబాలన్ ప్రకటనల ద్వారా వినోద రంగంలో చురుకుగా మారాలని నిర్ణయించుకుంది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమెకు సినిమాల్లో పెద్ద బ్రేక్ రాకముందే 60కి పైగా టెలివిజన్ ప్రకటనల్లో నటించింది.

Telugu Pradeep, Jalsa, National Award, Parineetha, Silver Screen, Vidya Balan, V

పరిణీత సినిమాలో దర్శకుడు ప్రదీప్ సర్కార్ సిఫార్సుపై భలో తేకోతో బెంగాలీ సినిమాలో అరంగేట్రం చేసిన తర్వాత విద్యాబాలన్ పరిణీత కోసం ఆడిషన్ ఇచ్చిది.అయితే, నిర్మాత విధు వినోద్ చోప్రా మొదట్లో లలిత పాత్రలో బాగా పాపుల‌ర్ అయిన‌ నటిని ఎంపిక చేయాలని భావించారు.అయితే అప్ప‌టికే విద్యాబాలన్ ఈ చిత్రం కోసం ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్‌లు ఇచ్చింది.

తరువాత, చోప్రా ఆమెను ఈ చిత్రంలో ఎంపిక చేశారు.ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు.

ప్ర‌స్తుతం మహిళా ప్రాధాన్య‌త గ‌ల చిత్రాలను విజయవంతం చేయడంలో గ్యారెంటీ ఉన్న నటీమణులలో విద్యాబాల‌న్ ఒక‌రిగా నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube