ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో లక్ష దీపోత్సవం ఎలా జరిగిందంటే..?

సాధారణంగా చెప్పాలంటే కార్తీక మాసం( Karthika Masam )లో చాలామంది ప్రజలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం ఆచరించి పూజలు దీపారాధన చేస్తూ ఉంటారు.అలాగే కార్తీక మాసంలోని ఒక్కో రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది అని పండితులు చెబుతున్నారు.

 How Did Laksh Deepotsavam Happen In This Famous Shrine , Karthika Masam, Amar-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే అమరేశ్వర ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని నరసరావుపేటకు చెందిన అమ్మ అసోసియేషన్ బాల చాముండిగా సమేత అమరహేశ్వర ఆధ్యాత్మిక సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ దేవాలయంలో స్వామి ఎదురుగా పేద పండితులు ప్రత్యక్ష పూజలు చేసిన తర్వాత అమ్మ సంస్థ ప్రతినిధులు శివాజీరావు, దేవాలయ కార్యానికి వాహనాధికారి వేమూరి గోపీనాథ శర్మ చేతుల మీదుగా భగవాన్ నామ సంకీర్తనలు, మేళ తాళాలు నడుమ లక్ష దీపోత్సవాన్ని మొదలుపెట్టారు.అలాగే మహిళలు లక్ష దీపాలను వెలిగించారు.ఈ దీప కాంతులతో దేవాలయం కొత్త శోభను సంతరించుకుందని భక్తులు చెబుతున్నారు.

అలాగే అమరేశ్వర ఆలయం( Amareswara Swamy Temple )లో శనివారం లోక కళ్యాణార్థం జరిగింది.

ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో దాతల సహకారంతో అమరేశ్వరుని కి లక్ష బిల్వార్చన ను భక్తిశ్రద్ధలతో దేవాలయ అర్చకులు వేద పండితులు జరిపించారు.తర్వాత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.అలాగే గణపతి హోమం( Ganapati Homam ) కూడా చేశారు.

అదే విధంగా స్వామికి విశేష అలంకరణ తర్వాత సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు.ఇక అలాగే అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు కూడా చేశారు.

అయితే ఈ సందర్భంగా దేవాలయ స్థానా చార్యుడు కౌశిక ధర్మ శేకర్ శర్మ గారు మాట్లాడుతూ.లక్ష బిల్వార్చన అలాగే కుంకుమార్చన విశిష్టత గురించి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube