ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం.6.27
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.08 ల8.44 మ2.32 ల2.44
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి.
వృషభం:

ఈరోజు ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.నూతన వస్తు వస్త్ర లాభలు పొందుతారు.సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
మిథునం:

ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది.
కర్కాటకం:

ఈరోజు ఋణ పరమైన సమస్యలు నుండి బయటపడతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.వ్యాపారాలలొ అంచనాలను దాటి లాభాలు అందుతాయి.
సింహం:

ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలొ కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య:

ఈరోజు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.
బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
తుల:

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
వృశ్చికం:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మెలకువ అవసరం.కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు కొనసాగుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది.వృత్తి సంబంధిత పనుల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు:

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.
మకరం:

ఈరోజు ఆధ్యాత్మిక సాధన, ప్రార్థనలను మీకు మానసిక శాంతిని ఇస్తాయి.పనిలో సవాళ్లు ఎదురవచ్చు.కానీ మీ కృషితో వాటిని అధిగమించగలరు.కుటుంబంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి.
కుంభం:

ఈరోజు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు.
ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం:

ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.