చెన్నై నగరంలో( Chennai ) రోడ్లపై ఆవుల బెడద రోజురోజుకూ ఎక్కువైపోతోంది.తాజాగా జరిగిన ఓ షాకింగ్ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
నడిరోడ్డుపై ఓ ఆవు రెచ్చిపోయి ఓ తల్లి, బిడ్డపై దాడి చేసింది.ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) ఆవు మొదట చిన్నారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
ఇది గమనించిన తల్లి వెంటనే బిడ్డను కాపాడేందుకు ముందుకు వచ్చింది.దాంతో ఆ ఆవు( Cow ) ఒక్కసారిగా తల్లిపైనే తిరగబడింది.ఆమెను తన కొమ్ములతో బలంగా కుమ్మేస్తూ తీవ్రంగా గాయపరిచింది.భయంతో కేకలు వేస్తూ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా, ఆవు మాత్రం వదలకుండా దాడి చేసింది.

చుట్టుపక్కల వాళ్లు వెంటనే స్పందించడంతో ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది.తీవ్రంగా గాయపడిన ఆ మహిళను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.ఘటన జరిగిన వెంటనే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) అధికారులు రంగంలోకి దిగి ఆ ఆవును పట్టుకుని వాహనంలో తీసుకెళ్లారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు.ఓ నెటిజన్ అయితే ఏకంగా జీసీసీని ట్యాగ్ చేస్తూ.“రోడ్లపై తిరుగుతున్న ఆవులు, కుక్కల గురించి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం.కానీ ఏమీ మారడం లేదు.
రోజూ వీధుల్లో ఇవే దర్శనమిస్తున్నాయి.మా ఏరియాలోనే 150కి పైగా ఆవులు, లెక్కలేనన్ని కుక్కలు ఉన్నాయి” అంటూ ఫైర్ అయ్యారు.

మరో యూజర్ అయితే మరింత ఘాటుగా స్పందించారు.“దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదు? అధికారులకు చర్యలు తీసుకునే దమ్ము లేదా, వీధి జంతువులకు సమాజంలో స్థానం ఉంది.కానీ బిజీ రోడ్లపై కాదు.” అని నిలదీశారు.
ఇంకొకరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ “షెనాయ్ నగర్‌లోని అయ్యవూ 2వ క్రాస్ స్ట్రీట్ దగ్గర, వల్లి ప్రైమరీ స్కూల్ పక్కనే ఆవులను కట్టేస్తున్నారు.వాటిని తొలగించమని జీసీసీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు” అంటూ వాపోయారు.
చెన్నైలో వీధి కుక్కలు, ఆవుల దాడులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి.గత ఏడాది ఆగస్టులోనే ఎంఎమ్‌డిఎ కాలనీలో ఓ ఆవు రెచ్చిపోయి 9 ఏళ్ల బాలికపై దాడి చేసింది.
స్కూల్ నుంచి అమ్మ, తమ్ముడితో కలిసి ఇంటికి వెళ్తున్న ఆ చిన్నారిని ఆవు గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టింది.
ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో జనం జీసీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోతో అయినా అధికారులు కళ్లు తెరుస్తారని, ప్రజల భద్రత కోసం శాశ్వత పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నారు.







