మిగిలిపోయిన ఆహారాన్ని( Leftover Food ) మీరు ఏం చేస్తారు, దాన్ని మళ్లీ తింటారు లేదా ఇతరులతో పంచుకుంటారు కదా.కానీ అమెరికన్ చెఫ్ జోష్ ఎల్కిన్( Chef Josh Elkin ) మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించాడు.ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టపడే ఎల్కిన్, మిగిలిపోయిన వాటితో ఏం చేస్తాడో తాజాగా ఓ వీడియోలో చెప్పాడు.“ఇండియన్ ఫుడ్ నా ఫేవరెట్.అందుకే ఎప్పుడూ ఎక్కువ ఆర్డర్ చేస్తా.మిగిలిపోయిన వాటిని ఏం చేస్తావని చాలామంది అడుగుతారు.నేనైతే వాటితో కేకులు చేస్తానంతే.” అని నవ్వుతూ చెప్పాడు.
అవును చికెన్ టిక్కా మసాలా కేక్ అన్నమాట.ఇతని క్రియేషన్ చూసి జనాలు షాక్ అవుతున్నారు.ఎల్కిన్ చేసిన ఈ “కేక్”( Cake ) రకరకాల ఇండియన్ ఫుడ్స్‌తో లేయర్ లేయర్‌గా పేర్చిన వంటకం.నానా రోటీ, చికెన్ టిక్కా మసాలా, చికెన్ బిర్యానీ, రైతా, పుదీనా చట్నీ, ఇలా చాలా వాటిని ఒకదానిపై ఒకటి పేర్చాడు.
పైన క్రిస్పీ ఆనియన్ భజ్జీలు, పికిల్డ్ రెడ్ ఆనియన్స్ (సిర్కే వాలే ప్యాజ్) పెట్టాడు.చివరగా నవ్వుతూ “కేక్ కావాలన్నా తినాలన్నా అందరికీ ఇష్టమే కదా” అని పంచ్ డైలాగ్ కూడా వేశాడు.

ఈ వీడియో క్షణాల్లో వైరల్( Viral ) అయిపోయింది.ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.కానీ అందరూ ఇంప్రెస్ అవ్వలేదు.చాలామంది భారతీయులైతే షాక్ అయ్యారు.ఒక నెటిజన్ దీన్ని ఇటాలియన్ ఫుడ్‌ని అవమానించినట్టు ఫీలవుతున్నారు అంటూ కామెంట్ చేశాడు.“స్పాగెట్టిని విరగ్గొడితే ఇటాలియన్స్‌కి ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది.” అని అన్నాడు.ఇంకొకరేమో “నీకు లెఫ్ట్ ఓవర్స్ ఇంత మిగిలిపోతున్నాయంటే, నువ్వు ఫుడ్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోవాలి” అని సలహా ఇచ్చాడు.

కొంతమంది రియాక్షన్స్ ఇంకా ఫన్నీగా ఉన్నాయి.ఒక యూజర్ “ఇది నా సంస్కృతిపై దాడి.మా లాయర్లు నీకు త్వరలోనే నోటీసులు పంపిస్తారు.” అని వార్నింగ్ ఇచ్చాడు.మరొకరేమో డ్రామా క్రియేట్ చేస్తూ “నేను హింసించే మనిషిని కాదు కానీ ఇప్పుడైతే గాలిలో గుద్దులు గుద్దాలనిపిస్తుంది.” అని ఫైర్ అయ్యాడు.ఇంకొందరు, ఈ ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్ చేసిన ఎల్కిన్‌ని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని సెటైర్లు వేశారు.







