లెమన్ గ్రాస్ టీ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

మన దేశంతో పాటు చాలా ఆసియా దేశాలలో లెమన్ గ్రాస్( Lemon grass ) మొక్క ఎంతో బాగా పెరుగుతుంది.ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్యకరమైన గుణాలు దాగి ఉన్నాయి.

 Are There So Many Health Benefits Of Drinking Lemon Grass Tea , Lemon Grass, Lem-TeluguStop.com

యాంటీ బ్యాక్టీరియాల్ ,యాంటీ ఆక్సిడెంట్( Antibacterial, antioxidant ) గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.అందువల్ల పలు అనారోగ్య సమస్యలకు ఈ మొక్క ఆకులను ఔషధంగా ఉపయోగించవచ్చు.

అందువల్ల చాలా అనారోగ్య సమస్యలకు ఈ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.నిత్యం ఈ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇంకా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దీని టీ తాగడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

Telugu Antibacterial, Antioxidant, Benefits, Kidney Problems, Lemon Grass, Lemon

అలాగే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.అలాగే రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది.ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.కిడ్నీ సమస్యలు( Kidney problems ) కూడా దూరం అవుతాయి.మూత్రం సాఫీగా వస్తుంది.

శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి వెళ్లిపోతాయి.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.అధిక బరువు కూడా దూరం అవుతుంది.

చర్మ సమస్యలు దూరం అవుతాయి.ఇందులో ఆంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ పదార్థాల శాతం చాలా ఎక్కువ మోతాదులో ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత సమాజంలో ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్య నిద్రలేమి అని కచ్చితంగా చెప్పవచ్చు.

Telugu Antibacterial, Antioxidant, Benefits, Kidney Problems, Lemon Grass, Lemon

గ్రాస్ ఆకులతో చేసిన టీ కండరాలను, మైండ్ ని రిలాక్స్ చేసి నిద్ర పట్టేలా చేస్తుంది.ఇలా కావడం వల్ల త్వరగా ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పడుతుంది.క్రమం తప్పకుండా ఈ టీ తాగడం వల్ల నెమ్మదిగా ఏజ్ సైకిల్ తగ్గుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే భోజనం కంటే ముందుగా ఒక కప్పు లెమన్ టీ తాగితే బాడీనీ క్లీన్ చేసి మనం తినే ఆహారం నుంచి ఎక్కువ ప్రోటీన్స్, న్యూట్రియన్స్ బాడీకి అందేలా చేసి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube