అతిమూత్రం సమస్యతో బాగా సతమతం అవుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి!

అతి మూత్రం సమస్య( Frquent Urination ).స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలామంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్య.

 Home Remedies To Get Rid Of Frequent Urination!, Frequent Urination, Frequent Ur-TeluguStop.com

అయితే దీని గురించి ఎవరు బయటకు చెప్పుకునేందుకు అంగీకరించరు.రోజులో ఎనిమిది కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే.

అలాగే మూత్రం ఆపుకోలేకపోవటం, ఉన్నట్టుండి అర్జెంటుగా మూత్రం రావడం, మూత్రంకు వెళ్లినా మళ్లీ వెళ్లాలనే ఫీలింగ్ కలగడం.ఇవన్నీ అతి మూత్రం సమస్య యొక్క లక్షణాలు.

Telugu Problem, Tips, Latest-Telugu Health

ఈ సమస్యను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.అలా చేస్తే సమస్య చాలా ప్రమాదకరంగా మారుతుంది.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో అతిమూత్రం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ ఇంటి చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నేరేడు గింజలు( Jamun Seeds ). అతి మూత్రం సమస్యను దూరం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి.నేరేడు గింజలను బాగా ఎండబెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తీసుకోవాలి.

ఇలా 30 రోజుల పాటు వరుసగా చేస్తే అతి మూత్రం సమస్య త‌గ్గుముఖం పడుతుంది.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు తొలగిపోతాయి.
అలాగే జీలకర్ర( Jeera ) కూడా అతి మూత్రం సమస్యను దూరం చేయగలదు.అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి.ప‌ది నిమిషాల పాటు మరిగిన తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఇలా చేసిన మంచి ఫలితం ఉంటుంది.

Telugu Problem, Tips, Latest-Telugu Health

వీటితోపాటు ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోండి.ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.రోజుకు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు బెల్లం( Sesame Seeds with Jaggery ) తో కలిపి తినండి.

మరియు రోజుకు ఒక ఉసిరికాయ అయినా తీసుకునేందుకు ప్రయత్నించండి.ఇవి మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి.అతి మూత్రం సమస్యకు చెక్ పెడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube