అయితే చాలామంది మునగ కాయల చారును ఎక్కువగా ఇష్టపడతారు.అయితే మునగాకులో, మునగ కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు తెలిసిందే.
అయితే మునగ పువ్వులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.
మునగ చెట్టు పువ్వులు తెల్లగా గత్తుగతులుగా పూస్తాయి.అయితే ఈ పూలతో టీ తయారు చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఆ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని మునగ పువ్వులను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఓ గిన్నెలో నీళ్లు పోసి మునగ పువ్వులను పూలను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి.
ఆ తర్వాత వీటిని వడకపెట్టి తేనె కలిపి ఉదయం పరగడుపున తాగాలి.ఇక డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళు మాత్రం తేనె లేకుండా తాగితే మంచిది.అలాగే గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు పడగడుపున తాగకుండా ఉండాలి.అయితే ఈ టీ ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే శరీరంలో ఉన్న అధిక బరువు, అధిక కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది.
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అలాగే సీజన్ పరంగా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.అదే విధంగా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.రక్తప్రసరణ కూడా బాగా సాగేలా చేస్తుంది.
అదే విధంగా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ఈ టీ ప్రోత్సాహిస్తుంది.ఈ టీ తాగడం వల్ల మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు.
అదేవిధంగా నీరసం, అలసట, నిస్సత్తువా లేకుండా హుషారుగా ఉండేలా ఈ టీ చేస్తుంది.ఈ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి.
అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు వారంలో ఈ టీ నీ రెండు మూడు సార్లు తాగితే మంచిది.