ఎన్టీఆర్ పై ఆరోపణలు... అలా చేస్తే హీరోలు అడుక్కు తినాల్సిందే.. ఫైర్ అయిన నటి!

ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా వివాదంలో చిక్కుకున్నారు.ఇకపోతే ఈ ఘటనలో భాగంగా మైత్రి మూవీ నిర్మాతలు చిన్నారి శ్రీ తేజ్( Sri Tej ) కు ఇటీవల 50 లక్షల రూపాయల చెక్క అందజేసిన సంగతి తెలిసిందే.

 Actress Madhavi Latha Fire On Ntr Fan Kaushik Mother Details, Kaushik, Ntr, Mad-TeluguStop.com

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) అభిమాని కూడా జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్( Kaushik ) అనే కుర్రాడు క్యాన్సర్( Cancer ) బారినపడి చివరి దశకు చేరుకున్నారు.

Telugu Actressmadhavi, Allu Arjun, Devara, Jr Ntr, Kaushik, Madhavi Latha, Ntr F

తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బ్రతికించండి అంటూ తల్లితండ్రులను వేడుకున్నటువంటి ఒక వీడియో చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పాలి.ఇకపోతే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అభిమానికి వీడియో కాల్ చేసి మరి తనని పరామర్శించి ధైర్యం చెప్పడమే కాకుండా తనకు అండగా ఉంటానని చెప్పారు.అయితే తాజాగా కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఇప్పటివరకు తనకొక రూపాయి కూడా సహాయం చేయలేదని ఈమె వ్యాఖ్యానించారు.

Telugu Actressmadhavi, Allu Arjun, Devara, Jr Ntr, Kaushik, Madhavi Latha, Ntr F

ఇలా జూనియర్ ఎన్టీఆర్ తనకు సహాయం చేయలేదు అంటూ ఈమె తెలియజేయడంతో సినీనటి మాధవీ లత( Madhavi Latha ) తీవ్రస్థాయిలో సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రకంగా హీరోలు అభిమానులకు డబ్బులు ఇస్తూ పోతే హీరోలు చివరికి అడుక్కు తినాల్సిందేనని ఈమె మండిపడ్డారు.ఇలా హీరోల నుంచి డబ్బులు ఆశించే వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు అంటూ ఈమె ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు హీరోయిన్ మాటలను సమర్థిస్తూ ఆమెకు మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం కోట్లు సంపాదిస్తున్న హీరోలు ఆమాత్రం పేదవారికి పంచితే తప్పేముంది అంటూ ఈమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube