ఈ సమయంలో ఆహారం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం...

ప్రస్తుతం సమాజంలోని ప్రజలకు అనారోగ్యకర ఆహారాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.ఇక ఆహారం తినే సమయం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచడం,తగ్గించడం వంటివి చేస్తుందని ఒక పరిశోధన తెలిసింది.

 If You Eat Food During This Time, There Is A Risk Of Cancer. , Eat Food, Health-TeluguStop.com

చాలామంది ప్రజలు రాత్రి తినే ఆహారం విషయంలో అసలు జాగ్రత్త తీసుకోరు.రాత్రి ఏ సమయంలో అంటే ఆ సమయం లో భోజనం చేస్తూ ఉంటారు.

రాత్రి 9 గంటల తరువాత రోజూ భోజనం చేసే వారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంది కనుగొన్నారు.అలాగే తిన్న తరువాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి పడుకోకుండా, వెంటనే నిద్రపోయే వారిలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మన శరీరం జీవ క్రియ సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. రాత్రి 9 దాటాక తినేవారిలో తిన్నాక రెండు గంటల తరువాత నిద్రపోని వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 25 శాతం అధికం ఉంది.

ఎందుకంటే రాత్రి అవుతున్న కొద్దీ మన జీవక్రియ రేటు తగ్గుతూ ఉండాలి.వేగంగా,చురుగ్గా ఉండకూడదు.

ఆలస్యంగా తినడం వల్ల రాత్రంతా జీర్ణవ్యవస్థ పనిచేస్తూనే ఉండవలసి వస్తుంది.ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు1205 మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారిని ఎంచుకొని వీరి జీవన విధానాన్ని పరిశీలించారు.

వీరిలో రాత్రి భోజనం చేశాక రెండు గంటల తరువాత నిద్రపోతున్నారో వారిలో ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కాబట్టి ప్రజలు రాత్రి 9 గంటల్లోపే తిన్నాక రెండు గంటల పాటూ నిద్రపోకూడదు.

Telugu Breast Cancer, Cancer, Tips, Lungs Cancer, Sleep-Telugu Health

క్యాన్సర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం ఉంది.పురుషులలో అత్యంత సాధారణమైన కొన్ని క్యాన్సర్లలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కాలేయ క్యాన్సర్లు ఉన్నాయి.స్త్రీలలో రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు అధికంగా వస్తాయి.పొగాకు వినియోగం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, వాయు కాలుష్యం కూడా క్యాన్సర్ కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube