1.నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధనఖర్ నామినేషన్ దాఖలు చేశారు.
2.వరదలపై జగన్ రివ్యూ
గోదావరి వరదలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
3.మెగా బ్రదర్స్ పై నారాయణ కామెంట్స్
చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్ చేశారు.చిరంజీవి ఊసరవెల్లి లాంటోడు అని, పవన్ కళ్యాణ్ ఓ ల్యాండ్ మైన్ అంటూ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
4.తెలంగాణలో నేడు భారీ వర్షాలు
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
5.వరదల ఎఫెక్ట్ : నేడు రేపు స్కూళ్లకు సెలవులు
యానం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తీవ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు యానంలోని అన్ని స్కూళ్లకు సెలవులను ప్రకటించినట్లు యానం పరిపాలన అధికారి శర్మ తెలిపారు.
6.నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
7.కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరిలో వరద వృద్ధి కొనసాగుతూనే ఉంది.దీంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.
8.నేడు రాష్ట్రపతి ఎన్నిక
భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు సాయంత్రం ఐదు గంటల వరకు పార్లమెంట్ , వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది.
9.నేటి నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష
నేటి నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం కానుంది.ఈ పరీక్షలకు 1,72,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
10.ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలోని ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు కాలేశ్వరం నుంచి ఎస్సారెస్ పీ వరకు పరిశీలిస్తారు.
11.నేడు లష్కర్ బోనాలు రంగం కార్యక్రమం
నేడు లష్కర్ బోనాలు రంగం కార్యక్రమం జరగనుంది భవిష్యవాణి వినిపించనున్న అమ్మవారి భక్తురాలు.
12.యధాతధంగా ఎంఎంటీఎస్ రైలు
నేటి నుంచి హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు యధాతధంగా నడవనున్నాయి.
13.నేడు తెరుచుకోనున్న తెలంగాణలోని పాఠశాలలు
తెలంగాణలో నేడు పాఠశాలలు తెలుసుకొని ఉన్నాయి వర్షాలతో వారం రోజులుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో నేడు వాటిని పున ప్రారంభించనున్నారు.
14.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సందర్భంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటు ను బిజెపి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేశారు.
16.జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తివేత
దూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టుకు ఉన్న 23 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగకు విడుదల చేశారు.
17.రేపు పాఠశాలల బంద్ : ఏబీవీపి
ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పార్టీ పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
18.శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వైభవంగా జరిగింది.
19.రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టిడిపి అధినేత చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
20.మంగళవారానికి వాయిదా పడిన రాజ్యసభ సమావేశాలు
విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
.