బిగ్ బాస్ సీజన్ 2 లో సత్తా చాటిన నందిని రాయ్ ఆ సీజన్ తర్వాత తన క్రేజ్ పెంచుకుని వరుస వెబ్ సీరీస్ లలో నటిస్తుంది.ఇక ఆదివారం తన బర్త్ డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చింది నందిని రాయ్.
ఈ పార్టీలో తన బిగ్ బాస్ హౌజ్ మెట్స్ తో పాటుగా కొందరు సెలబ్రిటీస్ కూడా వచ్చారు.బిగ్ బాస్ 2లో పాల్గొన్న తనీష్ కూడా ఈ పార్టీలో పాల్గొనగా రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్ లు కూడా నందిని రాయ్ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.
మొత్తం బుల్లితెర, వెండితెర భామలంతా వారితో పాటుగా బిగ్ బాస్ బ్యాచ్ అంతా కూడా నందిని రాయ్ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.నందిని రాయ్ కెరియర్ విషయానికి వస్తే ఆమె సినిమాల్లో కన్నా వెబ్ సీరీస్ లు చాలని భావిస్తుంది.
కెరియర్ ఫుల్ స్వింగ్ లోనే ఉన్న నందిని రాయ్ మళ్లీ వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.వెబ్ సీరీస్ లో తన గ్లామర్ షోతో ఎలాంటి సన్నివేశాలకైనా అమ్మడు రెడీ అంటుంది.
అలా చేయబట్టే అమ్మడికి వరుస వెబ్ సీరీస్ ఛాన్సులు వస్తున్నాయి.బర్త్ డే పార్టీలో అమ్మడు డ్రెస్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
.