పొడవాటి కురుల కోసం ఆరాటపడే మగువలు ఎందరో ఉంటారు.ఈ క్రమంలోనే జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు తోచిన చిట్కాలను పాటిస్తుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన రెమెడీస్ ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వాడితే వద్దన్నా కూడా మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
మరి ఇంతకీ ఆ మిరాకిల్ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మూడు ఉసిరికాయలను తీసుకుని గింజలు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక కప్పు ఆవనూనె వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసి స్పూన్ తో తిప్పుతూ ఉడికించాలి.
చిన్న మంటపై దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్ స్టోర్ చేసుకోవాలి.జుట్టు ఆరోగ్యానికి ఈ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను పట్టించి మసాజ్ చేసుకోవాలి.
ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల తర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ నూనెను వాడితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ సమస్య ఉంటే దూరం అవుతుంది.
కురుల ఆరోగ్యంగా మారతాయి.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.








