Vinodhaya Sitham Vs Bro: 5 కోట్ల “వినోదయసీతం” ని 100 కోట్ల “బ్రో” గా మార్చడానికి చేసిన మార్పులు ఇవే !!

వినోదయ సీతాం….( Vinodhaya Sitham ) ఇది 2021 లో విడుదలైన ఒక తమిళ చిత్రం.

 What Are The Changes For Pawan Kalyan Bro Movie And Vinodaya Sitham Movie-TeluguStop.com

సముద్రఖని( Samudrakani ) దర్శత్వం వహించారు.ఈ చిత్రం జీ 5 లో డైరెక్ట్ ఓ టీ టీ రిలీజ్ చేయబడింది.

ఎటువంటి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.కాంటెంట్ బాగుంటే, స్టార్ కాస్ట్లు, భారీ బడ్జెట్లు అవసరం లేదని ఈ చిత్రం నిరూపించింది.

ఒక 70 ఏళ్ళ ముసలాయన్ని హీరోగా పెట్టి అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమానే ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “బ్రో”గా( Bro Movie ) రీమేక్ చేసారు.

కాంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిం అయిన ఈ చిత్రాన్ని రీమేక్ చేద్దాం అని డిసైడ్ అయిన మేకర్స్ తమిళ్ లో వర్కౌట్ అయిన ఫార్ములా తెలుగులో వర్కౌట్ అవ్వదనీ భయపడ్డారేమో.పవన్ కళ్యాన్ని( Pawan Kalyan ) రంగం లోకి దింపేశారు.

కథలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని కమర్షియల్ సినిమా చేసేసారు.పవన్ కళ్యాణ్ ఇమేజీకి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాను మార్చేసాడట మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

కానీ సినిమా ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం మారకుండా జాగ్రత్త పడ్డారు.అసలు అంత జాగ్రత్తగా వీళ్ళు చేసిన మార్పులేంటో ఇప్పుడు చూసేద్దామా?

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samudrakhani, Trivikram, Vinodaya Sith

వినోదయ సీతాం అంటే విభిన్నమైన నిర్ణయం అని అర్ధం.జీవితం అంటే పర్ఫెక్ట్ గా, ప్లాన్డ్ గా బ్రతకడమే అనుకుంటాడు 70 ఏళ్ళ పరశురామ్.క్రమశిక్షణతో, సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ, కుటుంబం పట్ల, తన వృత్తి పట్ల బాధ్యతగా ఉండే ఆయన, ఒకరోజు హఠాత్తుగా ఒక కారు ప్రమాదంలో మరణిస్తాడు.

అప్పుడు సమయం (సముద్రఖని) అతనిని పరలోకానికి తీసుకెళ్తాడు.కానీ పరశురామ్ తాను ఇంకా నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయని, తనకి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వమని సమయాన్ని అడుగుతాడు.

అసలు జీవితం అంటే ఏమిటో పరశురాంకి తెలియజేయాలనే ఉద్దెశంతో 90 రోజుల సమయాన్ని ఇస్తాడు.ఈ 90 రోజుల గడువులో పరశురామ్, అసలు తాను జీవితం అనుకోని ఇన్నాళ్లు బ్రతికినది జీవితం కాదని, మనం చూసే కోణంలో జీవితం ఉండదని, తెలుసుకొని, అసలు జీవితం పరమార్ధం గ్రహిస్తాడు.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samudrakhani, Trivikram, Vinodaya Sith

ఈ కథ అంత పరశురామ్ భార్య, పిల్లల చుట్టూ తిరుగుతుంది.సినిమా అంత హ్యూమర్ తో, ఎమోషన్స్ తో నడిపి, క్లైమాక్స్ని గుండెకు హత్తుకునే ఒక మంచి సన్నివేశంతో ముగించారు.ఇలాంటి ఎమోషనల్ కథను పవన్ కళ్యాణ్ తో చేయడం అంత సులభం కాదు.అందుకే కొన్ని మార్పులు చేసారు.70 ఏళ్ళ పరశురామ్ క్యారక్టర్ ని యంగ్ సాయి ధర్మ తేజ్ గా ( Saidharam Tej ) మార్చారు.అక్కడ భార్య, కూతురు, కొడుకు క్యారెక్టర్లకు అనుసంధానంగా, తల్లి, చెల్లి, లవర్ క్యారెక్టర్స్ సృష్టించారు.

ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ పాత్ర.అందులో సముద్రఖని చేసినట్టు పవన్ కళ్యాణ్ చేస్తే కుదరదు.

అందుకే సాయి ధర్మ తేజ్ కి ఫైట్లు, పాటలు పెట్టి వింటేజ్ పవన్ ని బయటకు తెచ్చే ప్రయత్నం చేసారు.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samudrakhani, Trivikram, Vinodaya Sith

పవన్ కళ్యాణ్ పాత్రకి కాస్త ఎనర్జీ ఇచ్చి, నిడివిని 70 శాతం పెంచారు.ఈ మార్పులు ఫాన్స్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యాయి.కానీ సినిమా ఎమోషనల్ కంటెంట్ని దెబ్బతీశాయి.

వినోదయసీతంలో సినిమా క్లైమాక్స్ కు చేరేసరికి అందరు సినిమాలో ని క్యారెక్టర్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.బ్రోలో ఆ ఎమోషనల్ టచ్ కరువయిందనే చెప్పాలి.

వినోదయసీతంలో క్యారెక్టర్స్ అన్ని నిజ జీవిత పాత్రలు అనే అనుభోతిని కలిగిస్తాయి.కానీ బ్రోలోని స్టార్ కాస్ట్ ఆ అనుభూతిని దెబ్బతీసింది.

ఐనప్పటికీ ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది.దీనిబట్టి కథకు చేసిన మార్పులు బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube