ఎండాకాలంలోని ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గి వర్షాలు మొదలయ్యాయి.సీజనల్ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు రావడం సహజం.
ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అటువంటి వాటిలో బీట్రూట్ ముఖ్యమైనది.
ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.బీట్రూట్ ( Beetroot )తో తయారు చేసిన ఆహారాలను ప్రతి రోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే బీట్రూట్ లో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి.దీనిని సలాడ్ల రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బీట్రూట్ లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది.ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బీట్రూట్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్( Beetroot juice ) ను తాగడం వల్ల రక్తహీనత, రోగనిరోధక శక్తి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

బీట్రూట్ లో అధిక మోతాదులో లభించే నైట్రేట్ వల్ల రక్తపోటు( blood pressure ) నియంత్రణలో ఉండడమే కాకుండా శరీరం లోని రక్తాన్ని గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది.అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ శరీరంలో శక్తి స్థాయిలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే బీట్రూట్ లో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.దీని రసాన్ని మొహానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.