జిడ్డు చర్మం కోసం రెండు ప్రత్యేకమైన స్కిన్ మాయిశ్చరైజర్స్

చర్మం జిడ్డుగా ఉంటే ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.చర్మానికి ఏది రాసిన నూనె,జిడ్డు రూపంలో కనపడుతూనే ఉంటుంది.

 Diy Skin Moisturiser For Oily Skin , Diy Skin, Oily Skin, Moisturiser, Milk, Hea-TeluguStop.com

ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం అసహ్యంగా కనపడుతుంది.ప్రతి గంటకు ముఖాన్ని శుభ్రం చేసుకున్న సరే పరిస్థితిలో మార్పు కనపడదు.

ఈ సమస్య పరిష్కారం కావాలంటే ముఖాన్ని తప్పనిసరిగా తేమగా ఉంచుకోవాలి.ముఖంలో తేమ ఎక్కువగా ఉంటే జిడ్డు సమస్య కనపడదు.

కాబట్టి ఎప్పుడు ముఖం తేమగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉంటె జిడ్డు సమస్య తొలగిపోతుంది.

మాయిశ్చరైజర్స్ ని ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా తయారుచేయాలో వివరంగా తెలుస్కుందాం.

అరకప్పు పాలలో మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ ని కలపాలి.ఈ రెండు బాగా కలవాలంటే కనీసం అరగంట సమయం పడుతుంది.కాబట్టి కాస్త ఓపికగా వెయిట్ చేయాలి.ఈ రెండు బాగా కలిసాక రాత్రి పడుకొనే ముందు గాని లేదా ఉదయం స్నానము చేసిన తర్వాత గాని ముఖానికి రాసుకోవాలి.

అవసరమైతే ఈ మాయిశ్చరైజర్ లో నిమ్మరసం కూడా కలపవచ్చు.ఒక కప్పు నీటిని మరిగించాలి.మరుగుతున్న నీటిలో గులాబీ రేకులను వేసి 45 నిమిషాల పాటు మరిగించాలి.ఈ నీటిని వడకట్టి ముఖానికి రాయాలి.

ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు తొలగిపోతుంది.అవసరమైతే ఈ మిశ్రమంలో కలబంద జెల్ ని కలపవచ్చు.

ఈ రెండు మాయిశ్చరైజర్స్ చర్మంలో జిడ్డు తొలగించటానికి సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube