టమాటాలు.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
చూసేందుకు ఎర్రగా నిగ నిగ లాడుతూ అందంగా కనిపించే టమాటాలను వంటల్లో విరి విరిగా వాడుతుంటారు.అలాగే ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటీన్, ఫైటో కెమికల్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉండే టమాటాలను కొందరు పచ్చిగా కూడా తింటుంటారు.
అయితే టమాటాలను పచ్చిగా తినొచ్చా? తినకూడదా? అంటే.నిశ్చింతగా తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా పచ్చి టమాటాలను తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు.తగిన మోతాదులో పచ్చి టమాటాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే సలాడ్స్ రూపంలో లేదా ఇతరితర విధాలుగా పచ్చి టమాటాను తీసు కుంటే.అందులో ఉండే విటమిన్ సి మరియ యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని సమర్థవంతంగా పెంచుతాయి.దాంతో వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇతర జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
ఉడికించిన టమాటాల్లో కంటే పచ్చి టమాటాల్లోనే కాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి.
అందు వల్ల, పచ్చి టమాటాలను తగిన మోతాదులో తరచూ తీసుకుంటే.ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.
ఇక ఒత్తిడి, తలనొప్పి, టెన్షన్ వంటి సమస్యలతో బాధ పడే వారు పచ్చి టమాటాలను సలాడ్స్ రూపంలో తీసుకోవడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం చేయాలి.ఇలా చేస్తే.ఒత్తిడి, తలనొప్పి, టెన్షన్ వంటి వాటితో పాటు నీరసం, అలసట వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.