1.అమెరికాలో చరిత్ర సృష్టించిన భారతీయురాలు
అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి నియమితులయ్యారు.
2.యూఏఈ లాటరీ లో ప్రవాస భారతీయుడి హవా
యూజర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా దుబాయ్ లో నిర్వహించిన మహా జుజ్ వీక్లీ డ్రా లో విజేతగా ప్రవాస భారతీయుడు అరవిందన్ (22) ఒక కేజి బంగారం గెలుచుకున్నాడు.
3.జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్
ఒమి క్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
4.బిపిన్ రావత్ మృతిపై అమెరికా రక్షణశాఖ సంతాపం
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడంపై అమెరికా రక్షణ శాఖ తమ సంతాపం వ్యక్తం చేసింది.
5.ఆ దేశాలపై చైనా ఆగ్రహం
ఒలంపిక్స్ ను బహిష్కరించిన దేశాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఒలంపిక్స్ లో అమెరికా దాని మిత్రదేశాలు రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.
6.మెక్సికో లో ఘోర ప్రమాదం 53 మంది వలసదారుల మృతి
మెక్సికో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దక్షిణ మెక్సికోలోని వియా పాస్ రాష్ట్రంలో వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్ పాదచారుల రెయిలింగ్ ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో 53 మంది మరణించగా, మరో 53 మందికి గాయాలయ్యాయి.
7.డబ్ల్యూహెచ్ వో సూచన
కొవిడ్ వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద ఈ వ్యాక్సిన్ ను దాచి పెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరి కట్టకపోతే ఒమి క్రాన్ ను ఎదుర్కోవడం అసాధ్యమని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది.
8.మయన్మార్ లో దారుణం .చేతులు కట్టి దహనం
మయన్మార్ లో మారణహోమం చోటుచేసుకుంది. 11 మందిని చేతులు కట్టేసి మిలటరీ బలగాలు సజీవ దహనం చేశాయి.
9.దక్షిణాసియా టాప్ సెలబ్రిటి గా ప్రభాస్
దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు.ఈ ఏడాదికి గాను బ్రిటన్ వారపత్రిక ఈస్ట్రన్ఐ ఈ జాబితాను రూపొందించింది.
10.యూఏఈ బాటలో షార్జా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ ) ఇటీవల అధికారిక పని దినాలు వారానికి నాలుగున్నర రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో షార్జా మూడురోజుల వీక్ ఎండ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.