ఆర్జీవీ ఓ విచిత్ర జీవి అంటారు చాలా మంది.ఎవరి మాట వినడు.
తనకు నచ్చిందే చేస్తాడు.తనకు ఏది అనిపిస్తే.
అది చేస్తాడు.అందరి జోలికి వస్తాడు.
కానీ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒకే ఒక్క హీరోతో ఎలాంటి వివాదాలు పెట్టుకోలేదు.ఈయనపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేయలేదు.
ఇకపై చేస్తాడు అని కూడా అనుకోలేం.ఎందుకంటే సదరు హీరోతో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది.
ఇంతకీ ఆర్జీవీకి ఇష్టమైన ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్జీవీకి ఇష్టమైన ఆ నటుడు ఎవరో కాదు.
అక్కినేని నాగార్జున.శివ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు.
ఎన్ని సినిమాలు చేసినా నాగార్జున కెరీర్ లో శివ ఓ మైలు రాయిగా చెప్పుకోవచ్చు.ఆర్జీవీ కెరీర్ లో కడా శివను మించిన మరో సినిమా చేయలేదని చెప్పుకోవచ్చు.
అందుకే ఆర్జీవీ అంటే నాగార్జునకు ఎంతో అభిమానం.ఆర్జీవీతో కలిసి నాగార్జున పలు సినిమాలు చేసినా.
అవి విజయం సాధించలేకపోయినా.వర్మ మీద నాగ్ కు ఏమాత్రం అభిమానం తగ్గలేదు.
ఇప్పటికిప్పుడు కలవాలి అని చెప్పినా.నాగార్జున ఆర్జీవీకి సమయం ఇస్తాడంటే.
ఆయన మీదున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అటు తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమాలో నాగార్జున నటించాడు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నాగార్జునకు తెలిసినా చేశాడు.అందులో కంటెంట్ లేదు.
ఆర్జీవీ లాంటి దర్శకుడు కంటెంట్ లేని సినిమా చేస్తాడని ఎవరూ అనుకోరు.అలాగే నాగ్ కూడా వర్మను నమ్మి బొక్కబోర్లా పడ్డాడు.
నాగార్జున గెటప్ విషయంలోనూ ఆర్జీవీ తగు జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి.వీటిని నాగార్జున అంతలా పట్టించుకోలేదు.

అంతేకాదు.నాగార్జున, రామ్ గోపాల్ వర్మ మీద నమ్మకంతో తన కుమారుడు నాగ చైతన్యతో బెజవాడ మూవీకి ఒప్పించాడు.అదో వివాదాస్పద కథ అని తెలిసినా.వర్మ మీద నమ్మకంతో ఓకే చెప్పాడు చైతు.కానీ ఈ సినిమా సైతం విజయం సాధించలేదు.అయినా తనకు ఆర్జీవీ అంటే ఇప్పటికీ అభిమానం తగ్గలేదంటాడు నాగార్జున.
నాగార్జునకు ఆర్జీవీ అంటే ఎందుకు అంత ఇష్టం?
.