ఐరన్ ఒంటికి మంచిది.రక్తం పుట్టేదే దీని వలన కదా.
అందుకే రోజుకి 18-20 మిల్లిగ్రాముల ఐరన్ యుక్తవయస్సులోకి వచ్చిన శరీరానికి అవసరం అని చెబుతారు డాక్టర్లు.కాని ఏది అయినా లిమిట్ లోనే కదా తీసుకోవాలి.
అతిగా తాగితే మంచినీళ్ళు కూడా విషమే.అలాంటిది ఐరన్ మన ఒంటికి చేటు చేయకుండా ఉంటుందా? అతిగా ఐరన్ ఒంట్లోకి చేరితే మన లివర్ ప్రమాదంలో ఉన్నట్లే అని ఢిల్లీకి చెందిన డాక్టర్స్ చెబుతున్నారు.అందులోనూ, ఈ ప్రమాదం అబ్బాయిలకు ఎక్కువ అంట, అమ్మాయిలకు తక్కువ అంట.అదెలా, ఐరన్ ఎవరి ఒంట్లోకి వెళ్ళినా, లివర్ అదే ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?
ఇక్కడే, అమ్మాయిలకి పీరియడ్స్ సహాయపడేది.అర్థం కాలేదా ? పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు రక్తాన్ని బాగా కోల్పోతారు అని తెలిసిందే కదా.ఇలా రక్తం బయటకి పోవడం వలన, స్త్రీ శరీరంలో అయితే గియితే, ఐరన్ శాతం తగ్గే సమస్య ఉంటుంది కాని, ఐరన్ శాతం లిమిట్ దాటే ఛాన్స్ తక్కువే అని చెబుతున్నారు వైద్యులు.అబ్బాయిలకి ఇలా జరగదు కాబట్టి, వారి బాడిలో ఐరన్ శాతం అతిగా పెరిగే అవకాశాలు ఉంటాయి.అదే జరిగితే లివర్ ప్రమాదంలో పడుతుంది.
ఒంట్లో ఐరన్ విపరీతంగా పెరిగిపోతే, అది జాయింట్స్ ని, శరీర భాగాలకి నష్టం చేకూరుస్తూనే, ప్రాణం తీసేంత ప్రమాదకరంగా కూడా మారవచ్చు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్.సామాన్యంగా అయితే, ఈ కారణంతో లివర్ ప్రమాదం రావడం జెనెటిక్ అయినా, ఒక్కోసారి డైట్ వలన కూడా ఒంట్లో ఐరన్ లిమిట్ దాటి ఇలా జరగొచ్చని చెబుతున్నారు.
అందుకే, ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఓ లిమిట్ లోనే తీసుకోవాలంట, అవసరానికి మించి తీసుకుంటే న్యూట్రింట్ కాస్త విషంగా మారుతుంది.అందుకే, ఐరన్ ఎక్కువగా ఉంటే క్యారట్, బీన్స్, ఆకుకూరలు (ముఖ్యంగా పాలకూర), పీస్, మటన్ .టూ మచ్ గా తినవద్దు.