నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం.. ఎక్కడుందో తెలుసా?

పరమ శివుడు నటరాజ స్వామిగా ఆనంద తాండవం చేసిన మహా పుణ్యక్షేత్రం చిదంబరం.తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగ యుగాల నుంచి ప్రసిద్ధి పొందింది.పంచ భూతాల్లో ఒకటైన ఆకాశ తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ క్షేత్రం.50 ఎకరాలుకు పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం.వైష్ణవులకు శ్రీరంగం ఎంత పవిత్రమో.శైవులకు చిదంబరం అంత పవిత్రమైన మహా క్షేత్రమని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.పంచభూత ఆలయాల్లోని శ్రీకాళహస్తి, కంచి, చిదంబరం ఒకే అక్షాంశంపై నిర్మితమై ఉండటం విశేషం.

 Do You Know The Nataraja Swamy Anandha Thandavam Temple Details, Nataraja Swamy-TeluguStop.com

నటరాజ స్వామి.

ఇక్కడ ఈశ్వరుడు నటరాజ స్వామిగా దర్శనం ఇస్తాడు.నాట్య భంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.

చేతిలో నిప్పు దుష్ట శక్తులను నాశనం చేస్తుందని అర్థం.అలాగే మరో హస్తం సర్వ జగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది.

ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది.పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు.

మహా విష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి పొమ్మని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

Telugu Anandathandava, Chidambaram, Devotional, Maha Vishnu, Nataraja Swamy, Nat

స్థల పురాణం.‘చిత్’ అంటే మనస్సు, అంబరం అంటే ఆకాశం అని అర్థం.ఎన్నో యుగాలకు ముందు పరమేశ్వరుడు ఇక్కడి తిలై వనాల్లో విహరించేవాడు.

శివుడు భిక్షువు రూపంలో తిరుగుతుంటే మోహిని అవతారంలోని విష్ణు మూర్తి ఆయనను అనుసరిస్తాడు.పార్వతీనాథుని ప్రకాశవంతమైన తేజస్సుకు మునుల సతీమణులు ఆశ్చర్యానికి లోనవుతారు.

దీంతో ఆగ్రహించిన మునులు సర్పాలను వదులుతారు.లయకారకుడైన శివుడు వాటిని మెడకు, నడుముకు కట్టుకుంటాడు.

ఈ సంఘటనతో మరింత ఆగ్రహించిన మునులు ఒక రాక్షసుడిని పంపుతారు.శివుడు ఆ రాక్షసుడి వీపు మీద కాలు మోపి కదలకుండా చేస్తాడు.అనంతరం ఆనందతాండవం చేస్తాడు.దీంతో భగవంతుని నిజ స్వరూపాన్ని గ్రహించిన మునులు ఆయనను శరణు కోరుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube