హనుమాన్ దేవాలయంలో ముస్లిం పూజారి.. అక్కడ ఎందుకు ఉన్నారో తెలుసా..?

సాధారణంగా ఎంత పెద్ద దేవాలయమైనా, వీధిలో చిన్ని గుడి అయినా అందులో పూజారి( Poojari ) ఉండడం సర్వసాధారణమే అని అందరికీ తెలుసు.ఆయన నిత్యం పూజలు చేయడం దేవాలయానికి వచ్చే భక్తులకు దేవుని ఆశీర్వాదాలు అందించడం చేస్తూ ఉంటారు.

 Korikoppa Hanuman Temple Where Muslim Poojari Performs Pooja Details, Korikoppa-TeluguStop.com

అయితే ఏ దేవాలయంలో అయినా పూజారి హిందువులే ఉంటారు అని కచ్చితంగా చెప్పవచ్చు.బ్రాహ్మణ, వైష్ణవ కులాలకు చెందిన వారు సాధారణంగా పూజారులుగా అనేక దేవాలయాలలో విధులు నిర్వహిస్తూ ఉంటారు.

కానీ ఒక దేవాలయం లో పూజారి హిందువు కాదు.ఆ దేవాలయంలో ఒక ముస్లిం( Muslim Poojari ) 10 సంవత్సరాలుగా పండితులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Telugu Bhakti, Devotional, Gadaghanuman, Hanuman Temple, Hindus, Karnataka, Pooj

ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రం( Karnataka ) గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ సమీపంలోని కోరికొప్ప హనుమాన్ దేవాలయం( Korikoppa Hanuman Temple ) ఉంది.150 సంవత్సరాలుగా ముస్లింలు పూజారువులుగా విధులు నిర్వహిస్తున్నారు.ఎందుకంటే ఇది గతంలో వారికి హిందూ సోదరులు ఇచ్చిన ప్రత్యేక హక్కు.

ఈ దేవాలయ విశిష్టత ఏమిటంటే ముస్లింలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహాన్ని పూజిస్తారు.ముస్లిలు దేవాలయం మొదలైనప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు.కోరికొప్పలో ఎప్పుడూ మత ఘర్షణలు జరగకుండా హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Gadaghanuman, Hanuman Temple, Hindus, Karnataka, Pooj

పూర్వం కోనేరికొప్ప, కొండికొప్ప, కోరికొప్ప గ్రామాల ముఖద్వారం వద్ద చిన్న హనుమాన్ ఆలయం( Hanuman Temple ) ఉండేది.కోనేరికొప్ప, కొండికొప్ప ఈ గ్రామాల ప్రజలు గతంలో ప్లేగు, కలరా వ్యాధులు వచ్చి వలసలు వెళ్లడంతో ఇప్పుడు ఉనికి లేదు.ఈ గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చినప్పుడు సమీపంలోని పుటగావ్ బద్ని గ్రామానికి చెందిన కొన్ని ముస్లిం కుటుంబాలు దేవాలయంలో పూజలు కొనసాగించాయి.

ఆ తర్వాత దేవాలయాన్ని పునరుద్ధరించే తదితర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కోరికొప్ప గ్రామ పెద్దలు ముస్లింలకు అప్పగించారు.ఆ ఆనవాయితీ ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది.

అలాగే శ్రావణమాసంలో ( Shravanamasam ) కులమతాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ ఒక చోట చేరి దేవాలయంలో హోమాలు, భజనలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube