సాధారణంగా హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కటి వాస్తుపరంగా ఆలోచించి అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు.
ముఖ్యంగా ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో కొన్ని వాస్తు నియమాలను పాటించడం వల్ల సకల సంతోషాలతో పాటు శుభాలు కలుగుతాయని భావిస్తారు.మరి శ్రావణ మాసంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటి? వాటిని పాటించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా శ్రావణ మాసం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మాసం.ఈ మాసంలో పరమేశ్వరుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కనుక భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
కోరిన కోరికలు నెరవేరాలంటే తప్పకుండా ఈ వాస్తు పద్ధతులను పాటించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.పరమేశ్వరుడికి నీరు ఎంతో ప్రీతికరం కనుక మన ఇంట్లో నీళ్లు ఎల్లప్పుడు ఉత్తర భాగంలో ఉంచడం శుభకరం.
ఇలా చేయడం వల్ల మన ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి ధన ప్రవాహం ఉంటుంది.
మనీ ప్లాంట్ ను ఉత్తరం వైపు నాటడం వల్ల ఎంతో సానుకూల ఫలితాలను పొందవచ్చు.
మనీ ప్లాంట్ నాటడానికి శ్రావణమాసం ఎంతో అనుకూలమైన మాసం.మన ఇంట్లో మనీ ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ డబ్బులు కూడా బాగా వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
శ్రావణమాసంలో పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.అయితే అర్ధనారీశ్వరుడుగా ఉన్న పరమేశ్వరుడి ఫోటోను తూర్పు దిశవైపు ఉంచి పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
ఈ విధంగా అర్ధనారీశ్వరుడుకి పూజ చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి.

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.కనుక తులసి మొక్కను శ్రావణమాసంలో ఉత్తరం వైపు నాటి పూజ చేయటం ఎంతో మంచిది.అవివాహితులు తులసి చెట్టు నాటి పూజ చేయటం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది.
గంగా జలానికి ఎంతో శక్తి ఉంటుందని చెబుతారు.ఈ క్రమంలోనే శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు ఉదయం ఇంటిలో గంగాజలం చల్లడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.